Take a fresh look at your lifestyle.

నా చావుకి.. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డే కారణం అని లెటర్‌ ‌రాసి..

హన్మకొండ నడి బొడ్డున దారుణం జరిగింది. నర్సంపేట డివిజన్‌లోని నెక్కొండ మండలం అలంకానాపేట గ్రామానికి చెందిన మాసం వెంకటేశ్వర్లు హన్మకొండ అమరవీరుల స్థూపం ముందు మంగళవారం ఏకంగా గొంతు కోసుకుని ఆత్మహత్యానికి ఒడిగట్టాడు. స్థానికులు, బందువుల కథనం ప్రకారం … మాసం వెంకటేశ్వర్లు కుమారుడు మాసం రాంరాజ్‌ ‌నర్సంపేటలోని ఓ సొసైటీ బ్యాంకులో కాంట్రాక్టుపై పని చేస్తున్నాడని చెబుతున్నారు. కొద్ది రోజులలో అతన్ని తీసేసేటట్లు ఉన్నట్లు తెలిపారు.  ఈవిషయమై పలుమార్లు మాసం వెంకటేశ్వర్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని కలిసినట్లు చెప్పారు. టీఆరెస్‌ ‌కార్యకర్తను పార్టీ కోసం పని చేస్తున్నాని, అబ్బాయిని తిరిగి కాంట్రాక్ట్ ఉద్యోగంలో కొనసాగించాలనీ ఎమ్మెల్యేని కోరినట్లు తెలుపుతున్నారు. ఎలాంటి స్పందన రాకపోవడంతో మనస్థానానికి గురై ఈ దారుణానికి ఒడిగట్టాడని పలువురు అంటున్నారు.

ఓడీసీ ఎమ్మెస్‌ ‌సొసైటీ బ్యాంకులో కాంట్రాక్ట్ ఉద్యోగిగా మాసం వెంకటేశ్వర్లు కుమారుడుఓడీసీఎమ్మెస్‌ ‌సొసైటీ బ్యాంకులో కాంట్రాక్ట్ ఉద్యోగిగా మాసం వెంకటేశ్వర్లు కుమారుడు రాంరాజ్‌ ‌పని చేస్తున్నట్లు తెలిపారు. కొద్ది రోజులలో ఆయనను ఉద్యోగం నుంచి తొలగించనున్నట్లు ఓడీసీఎమ్మెస్‌ ‌చైర్మన్‌ ‌రామస్వామి నాయక్‌ అన్నట్లు తెలుపుతున్నారు. దీంతో తన కుమారిడి ఉద్యోగం తీసేయ్యొద్దని ఎమ్మెల్యే చుట్టూ తిరగాడని  తెలుపుతున్నారు. ఇటీవల సీసీ రోడ్ల ప్రారంభోత్సవంలో కూడా ఎమ్మెల్యేను వెంకటేశ్వర్లు అడిగినట్లు చెబుతున్నారు. ఉద్యమనేపద్యం నుంచి కొనసాగుతున్న తనకు సరైన గుర్తింపు కరువైందనీ బాదతో ఇలా చేసిఉండచ్చని పలువురు అనుకుంటున్నారు.

అమరవీరుల స్థూపంవద్ద ఆత్మహత్య యత్నం
హన్మకొండ అదాలత్‌ ‌జంక్షన్‌ ‌వద్ద మాసం వెంకటేశ్వర్లు గొంతుకోసుకొని ఆత్మహత్యకు యత్నానికి పాల్పడ్డాడు. తన చావుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డే కారణమని లెటర్‌ ఉం‌డడంతో వాట్సప్‌లో వైరల్‌ అయింది. నెక్కొండ మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించిన స్థానికులు వెంటనే వరంగల్‌ ఎం‌జీఎం హాస్పిటల్‌కి తరలించారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!