Take a fresh look at your lifestyle.

మేడారం జాతీయ పండుగగా ప్రకటించాలి

festival declared,national festival,Madaram Summakka-Saralamma
ప్రభుత్వ చీఫ్‌ ‌విప్‌ ‌దాస్యం వినయ్‌భాస్కర్‌

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా ప్రకటించేలా రాష్ట్ర బిజెపి నాయకులు ఒత్తిడి తీసుకురావాలని ప్రభుత్వ చీఫ్‌ ‌విప్‌ ‌దాస్యం వినయ్‌భాస్కర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. సోమవారం హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసియాలోనే అతిపెద్ద జాతరగా జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని అలాంటి మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని అన్నారు. బిజెపి నాయకులకు ఆదివాసీల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా జాతీయ పండుగగా ప్రకటించి అందుకు తగినట్లుగా సౌకర్యాలు కల్పించాలన్నారు. దేశం నలుమూలల నుండే కాకుండా ఒక్క తెలంగాణ రాష్ట్రం నుండి ఆదివాసీలు గిరిజనులు పెద్దఎత్తున పాల్గొని సమ్మక్క సారలమ్మకు మొక్కులు తీర్చుకుంటారని అన్నారు. తెరాస ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి అనేక దఫాలుగా విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం జాతరను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు నిధులు కేటాయించడమే గాకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆదివాసీల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందన్నారు. ఆదివాసీ గిరిజనులే కాకుండా అన్ని వర్గాలకు చెందిన వారు వనదేవతలను సందర్శించుకునేందుకు వస్తుంటారని తెలిపారు. కోటి మందికి పైగా వివిధ రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారని అందు••నుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. జాతర సందర్భంగా పర్యావరణానికి దెబ్బతినకుండా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. జాతరలో ప్లాస్టిక్‌ ‌కవర్లు వాడకుండా ఫిబ్రవరి 1నుండి 5వ తేదీ వరకు రోజుకు 10వేలపై చిలుకు ఉచితంగా బట్ట సంచులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా 1వ తేదీ నుండే బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అంతేగాకుండా బస్సుల్లో ప్రయాణించే ప్రతీ భక్తునికి క్లాత్‌ ‌బ్యాగులను పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. 21న మేడారంలో వరంగల్‌ ‌పశ్చిమ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి అమ్మవారి గద్దెల వద్ద వారితో ప్రమాణం చేయించి ప్లాస్టిక్‌ను ఉపయోగించకుండా క్లాత్‌ ‌బ్యాగులను ఉపయోగించేలా భక్తులకు సూచనలు కూడా అందివ్వడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల ముఖ్య నాయకులంతా 6గంటల వరకే మేడారంకు చేరుకోవాలన్నారు. విలేకరుల సమావేశంలో డిప్యూటి మేయర్‌ ‌సిరాజొద్దీన్‌, ‌కుడా చైర్మన్‌ ‌మర్రి యాదవరెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌ అజీజ్‌ఖాన్‌, ‌కార్పొరేటర్‌ ‌వేముల శ్రీనివాస్‌, ‌జనార్ధన్‌గౌడ్‌, ‌శివశంకర్‌, ‌నయిమొద్దీన్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Tags: festival declared,national festival,Madaram Summakka-Saralamma


 

  
 

Leave a Reply