Take a fresh look at your lifestyle.

ఎరువుల దరువు రైతులకు బరువు

భారీగా ధరలు పెరిగిన ఎరువు
అన్నదాతలు మొయలేరు బరువు
ఉన్నట్లుండి కిసాన్‌ ‌ల పై పడ్డది పిడుగు
ఇక యవసాయం అప్పుల మడుగు

సాగుదారుడే  దేశానికి వెన్నెముక
మాటల్లో చూడు ఎంత మంచి పోలిక
చేతుల్లో నడ్డివిరిచేస్తవి కదురా పాలిక
ఎవడేలిన గిదే తీరు కనపడు పోలిక

బ్యాంకుల్ని మింగినోళ్ళకు సపోటు
పెద్దోళ్ళ కోట్లాది రుణాలు సర్దుబాటు
ఏ పార్టీ పాలన చూసినా గిదేతీరు!!!
అవి కార్చెది రైతుల పట్ల ముసలికన్నీరు!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్ట్

Leave a Reply