Take a fresh look at your lifestyle.

ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి

సూర్యాపేట, మే 12, ప్రజాతంత్ర ప్రతినిధి): జిల్లాలో ఖరీఫ్‌ ‌పంటకు రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్‌ ‌వినయ్‌కృష్ణారెడ్డి వ్యవసాయాధికారి జ్యోతిర్మయిని ఆదేశిం చారు. మంగళవారం కలెక్టరేట్‌ ‌కార్యాలయంలో జిల్లా వ్యవసాయా ధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతు ఖరీఫ్‌ ‌సీజన్‌లో రైతులకు అందించాల్సిన విత్తనాలలో ఎలాంటి జాప్యం ఉం డకూదని , రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లవొద్దని అధికారులకు సూచించారు. జిల్లాలో ఖరీఫ్‌ ‌సీజన్‌కి సంబంధించిన యూరియా, కాంప్లెక్స్ ఎరువులను బఫ్పర్‌ ‌స్టాక్స్ ‌నుండి ముందస్తుగా అన్ని మండలాల డీలర్లుకు, అలాగే పిఏసిఎస్‌ ‌సంఘాలకు తరలించాలని తెలిపారు. జిల్లాలోని అన్ని డీలర్ల వద్దకు ఎరువులను అందజేశామని, రైతులు తమకు కావాల్సిన ఎరువులను కొనుగోలు చేసుకో వొచ్చని తెలిపారు.

జిల్లాలో 13872టన్నుల యూరియా, 8397టన్నుల కాంప్లెక్‌ ఎరువులు, 1280టన్నుల డి.ఏపి బఫ్పర్‌ ‌స్టాక్‌ ‌రూపంలో అందుబా టులో ఉన్నదని పేర్కొన్నారు. ఖరీఫ్‌ ‌సీజన్‌లో రాయితీపై అందించడానికి 2184క్వింటాల జిలుగు విత్తనాలు జిల్లాలో పిఏసిఎస్‌ ‌పరిధిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని రైతులకు వరి పంట సాగుపై అవగాహన, మెలుకువలను అందించాలని అన్నారు. ఈ సమావే శంలో జిల్లా మేనేజర్‌, ‌జిల్లా సహకార అధికారి, జిల్లా భూగర్భ శాఖ అధికారి, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply