Take a fresh look at your lifestyle.

మా ఇంటి సందుకు అడ్డంగా కంచె, కొరోనా నీతి సూత్రం మా ముందుంచె …

కాకతీయ కలగూర గంప
(ముసలి ‘‘ముచ్చట్ల’’ చద్దిమూట)…

అది ఒకప్పటి ఫైర్‌ ‌స్టేషన్‌ ‌ప్రక్క  సందు
మట్టి  బాట, కరెంట్‌ ‌లేని ఇండ్లు
60 ఏండ్ల క్రితం విద్యుత్తులేని రోజుల్లో ధగాధగా మెరిసింది
అడుగు మీద అడుగు వేసి నడిస్తే  ఈ చివర నుండి ఆ చివరకు వెయ్యి ఆడుగులే!

ఇటు  చివర ఫైర్‌ ‌స్టేషనూ, అటు చివర భోగేశ్వర ఆలయమూ
ఆ రోజుల్లో వీధి రెండువైపులా మొత్తం  ఇండ్లు పదమూడే
ఆన్నీ పెంకుటిండ్లే, ఐనా  హేమా హేమీల నిలయాకే!

తెలుగు పండితోపాధ్యాయులు
విశ్వనాథ వారి తమ్ముడు వేంకటేశ్వర్లు, అనుముల కృష్ణమూర్తీ
భద్రకాళీ మాత ఉగ్రరూపాన్ని శాంతపరచిన బ్రహ్మర్షి  హరి రాధా కృష్ణ మూర్తీ
ప్రఖ్యాత ఆయుర్వేద గురువు  డాక్టర్‌ ‌హరి సూర్యనారాయణ మూర్తీ
ఒకే ఒక ఆడపిల్లల స్కూల్‌ ‌ప్రధానోపాధ్యాయురాలు సీతరామమ్మా…
అందరూ ఉత్తమ గురువులే, ఎందరికో దైవ సమానులే!!

ఆ సందు ఒక ఇంటి ముందు గదుల్లో కాకతీయ ప్రెస్సూ,
కాకతీయ పత్రిక నిర్వహణ  కార్య నిలయం
ఇంటి లోపలి వైపు  చిన్న మేడ గదిలో
చేతిలో  పెన్నుతో కాగితాలు నింపుతున్న
‘కాకతీయ’ ఎడిటర్‌ ‌సదాశివరావు

ఇక ఆ సందులో వందల సార్లు నడచిన
గార్లపాటీ, కాళోజీ  బ్రదర్సూ,  పీ వీ, ఇంకా ఇటువంటి మహనీయులెందరో

నిజంగా అప్పటి  ఆ సందు చందం
మేకప్పులేని సహజ ముఖారవిందం

ఇప్పుడో?
ఆ  సందు పేరు భోగేశ్వరాలయ వీధి.
మట్టి బాట సిమెంట్‌ ‌రోడ్డయింది
వీధి స్తంభాలకే కాదు – ప్రతి ఇంట్లో విద్యుద్దీప ధధగలు

ఆ వీధికిప్పుడు పక్క సందులు.
ఆ సందుల్లో ఇండ్లుబీ కావు కావు – భవనాలు
కొన్ని మూడు అంతస్థుల దాకా. అన్నీ కలిపితే అరవైకి పైగా
ఆ మొత్తం జనభా మూడు వందల దాకా
ఐనా ఆ వాడ మొత్తం  ఒకే కుటుంబం

ఇక నేనో? కొందరికి జ్యోతక్కా. కొందరికి భాభీ
మరెందరికో టీచర్‌…

‌మొన్నటి దాకా దేశంతో బాటు ఆ సందుకూడా లాక్‌ ‌డౌన్‌
‘అం‌దరితో బాటు నేను కూడా’   అని  సరిపెట్టుకుంది

కానీ ఇప్పుడు ఒక్క సారిగా ఆ సందు బావురుమంది
ఇప్పుడిదేమి చోద్యం? ఏమిటి ఈ ప్రారబ్దం??
కనబడని ఆ రోగం బందు చేసింది మా చిన్ని మార్గం!
కంచె  వెలిసింది మార్గాని కడ్డుగా
రాక పోకలకు వచ్చింది నిషేదం మొత్తంగా

ఎట్లా వచ్చింది ఈ మాయ మహమ్మారి
ఈ చిన్ని సందుల్లోకి, ఎట్లా దూరమౌతుందో మరి?

అలోచనలతో అప్పుడప్పుడే మూతలు పడ్డాయి కండ్లు
కొద్దిసేపటిలోనే దూరంగా వినబడుతున్న గొంతు
వినబడుతుంది చిన్నగా ఒక పాటగా
చెవులు రిక్కించుకొని విన్నాను జాగ్రత్తగా
‘‘వినరా వినరా ఓ మానవుడా, ఎలా సాగించాలో
నీ మనుగడా’’

‘కనబడని వారెవరిది ఈ గొంతూబీ  ఇంత రాత్రి  నిదురకు ముందూ’
అనుకున్నాం నేనూ మా వారూ అలసి సొలసిన మనసులతో

‘నేనమ్మా మీరు భయపడే కరోనా  అంటు వ్యాధిని
తెలుప వచ్చాను కరోనా నీతి ప్రబోధాన్ని…

మీ  అందరు నరులకు ఒకే ఆలోచనా విధానం
అట్ల్లాగే వుంటుంది మీ ప్రవర్తనా నియమం
మీరు తలచేది అందరికీ చెప్పేది –
‘మానవ జీవితమే మహనీయం’
‘మేము చెప్పిందే వేదం- ప్రకృతి మాకు దాసోహం’

‘బడిలోని గురువైనా, గుడిలోని రాతి దైవమైనా
ఎక్కడో కొండల్లో పుట్టి భూమిపై పడే నదీ నదమైనా

ఆఫ్రికా అడవుల వన మృగాలైనా,
ఆకాశంలో ఎగిరే ఖగ విహంగాలైనా
భూతలంపై ప్రాకే సర్పజాతులైనా,
నీటిలో ఈదే మత్స్య సంతతి ఐనా

ఆకాశమైనా, అంతరిక్షమైనా
హిమ పర్వత శిఖరమైనా, కొలరాడో లోయలైనా
జలమైనా, వనమైనాబీ చెట్టైనా, పుట్టైనా
అన్నిటినీ శాసిస్తాను, నాకవసరమైతే వేధిస్తాను

నా డాలర్లు, యూరోలుబీ నా అణు యుద్ధ నౌకలు,
నా ఆటం బాంబులుబీ నా ఎఫ్‌ ‌సిక్స్ ‌టీన్‌ ‌ఫాల్కన్లు
ఇవన్నీ నా ఒక్కొక్క ప్రయోగ సాధనం
ఎవరైనా కావల్సిందే మాకు దాసోహం

మానవ జాతి కెవ్వరూ లేరు సాటి
తెలుసుకోవాలి ఇది ఈ భూమండల సమస్త ప్రాణికోటి

అవనీతలమే కాదుబీ అంతరిక్షంలోని చంద్రుడే కాదు
బుధుడైనా, గురుడైనాబీ రింగు తొడుగుల శని ఐనా
తెలుసుకుంటాయి మానవ శక్తి యుక్తులు
మా నుండి కానే కారు వారు  విముక్తులు’’

ఇదమ్మా మీ నరుల  విఱ్ఱవీగుడుతనం
మీ మనసంతా  స్వార్థ చింతనా నిలయం

ఐతే ఏమైందని అనుకున్నవ్‌ ఈ అహంభావజాలం
ఐంది తనవేలితో తన  కన్ను తానే  పొడుచుకున్న  విధానం

ఇపుడు  మీ పనిపట్టుతున్న  నా జన్మకారణం
మీ మానవుడు చీదరించుకునే  గబ్బిలం
ఏ చెట్టు కొమ్మకో తల క్రిందులుగా వ్రేలాడే  ఎగిరే క్షీరదం
ఎక్కడో వున్న దాన్ని కెలికింది మీ మానవ తప్పిదం
ఇగ చూచుకో,  వచ్చింది సమస్త మానవ జాతికి
ఉపద్రవం

చెప్పాలనుకున్నాను మీకు గుణపాఠం
మార్చుకోండని ఇప్పటికైనా మీ జీవన విధానం

మనసులో ద్వేషం – పైకి మాత్రం నవ్వుతూ  కరచాలనం
ఈ ప్రవర్తనా విధానం మీ నర జాతికే సహజం

కృత్రిమ ప్రేమల స్నేహ బాంధవ్యాంతో వుండే
మీ కక్ష
కరచాలనాలు మీ ప్రాణాంతకమన్నదే నేను వేసే
ఈ శిక్ష
అందుకే కయ్యానికైనా, వియ్యానికైనా చేతులు కలపకు
నా అంతర్ధానం దాకా కరచాలనమనే మాట తలవకు

లేదంటే కరచాలనమే అవుతుంది కరోనా కాటు
ఇది తెలుసుకోకపోతే నీకే చేటు

గుళ్ళూ, పిల్లల బళ్ళూ బంద్‌
‌రైళ్ళ చలనం, విమానాల గమనం బంద్‌
‌స్విగ్గీ ఆర్డర్లూ, షాపుకు పోయి కొనే పిజ్జాలూ, మిర్చీ బజ్జీలు  బంద్‌
‘‘‌నా పనితీరు నా ఇష్టం’’ అనే ప్రపంచ పెద్దల ముఖాలలో నెత్తురు చుక్క బంద్‌

‘‘’‌బయటికంటే ఇల్లు పదిలం’’
ఇదీ పాటించవలచిన ముఖ్య నియమం
ఊరికే తిరగకు ఊరందరినీ విసిగించకు
తిరిగే బొంగరం పడక తప్పదు
అనవసర తిరుగుడు ఇక్కట్లు తేకా తప్పదు.

శారీరక  స్థిరత్వమే కాదు జత కావాలి మానసిక స్థిరత్వం దానితో
అనేది నేను చెబుతున్న నీతి మాట గూడార్థంతో

ఇక వేయాలమ్మా  నీ మూతికి మాస్కు
పెట్టాలి దాని అతి వాగుడుకు హద్దు

నీ మాటే కాదు నీ రాతలు కూడా వుండాలి శుభ్రంగా
అందుకే కలం పట్టే నీ చేతి వ్రేళ్ళు
కంప్యూటర్‌ ‌మౌజ్‌ ‌నాడించే నీ అర చేయి
కడగమన్నాను తరచుగా మలిన రహితంగా

కాబట్టి ఓ నరుడా
మాస్క్ ‌లేని కండ్లు తెరచి అన్ని  కనరా
రెండు చెవులొప్పగించి పూర్తిగా వినరా
కానీ  మాస్క్ ‌హద్దులో వుంచరా నీ నోటి మాట సరిగా
హమేషా సబ్బుతో కడిగే నీ చేతి రాత శుభ్రంగా

ఇపుడు కావల్సింది అర్జెంటుగా ఒక చిన్న సూది మందు.

డాలర్లూ, యూరోలూ, ఇంకా ఇలాంటి వెన్నో దాని ముందు సాధారణ కాగితాలే
అణు బాబులూ,  యుద్ధ విమానాలూ  ఇప్పుడు
ఆ సూది మొనంత అత్యల్ప సాధనాలే

నీ మాటల కోటలు, నీ డాంబిక నడవడి
ఆ సూదిమందు వచ్చే దాకా వ్యర్థం

అప్పటి దాకా తప్పదు
ముఖాన మాస్క్ ‌లేకుండా  బయటకు వస్తే శిక్షగా  తీసే  గుంజీలు
ఇంట్లోనుండే ఆఫీసు పని, ఎక్స్ ‌ట్రాగా వంటింటి పని
ఆన్‌ ‌లైన్‌ ‌మీటింగులు, బిల్లుల పేమెంటులు
బళ్ళు లెని పిల్లల చదువుల అయోమయం
భక్తులు లేని పూజల దేవాలయం

ఏమిటి ముఖం అట్లా పెట్టారు?
‘ఉంటామా,  ఊడుతామా’ అన్న భయమా?
70 ఏండ్ల ముసలి వయస్సనుకుంటున్నారా?

ఇప్పుడున్నట్లు నియతిగా ఉండండి
ఇప్పటిలాగే మీ ప్రభుత్వ  పెద్దలు చెప్పిన సూత్రాలు పాటించండి
బయటకు పోకండి, ఇంట్లో పరిశుభ్రత పాటించండి

ఇంట్లోకి బయటి వారెవ్వరూ రావొద్దు
నమస్కార సత్కారంతో బయటినుండే సాగనంపండి

‘అతిథి సత్కారాలు అన్నీ సరిగా వున్నప్పుడే!’
‘బ్రతికుంటే బలిసాకు తినొచ్చు’ అన్నది మరవకండి

ఇప్పటిలాగే మీ ఆరోగ్య సూత్రాలు పాటించండి
ఈ సూత్రాలు పాటించని ఎంత దగ్గరి వారైనా
దగ్గరకు రానివ్వకండి.

మీ మంచి ఆరోగ్యం మీకే కాదు
మీ పొరుగు వారికి కూడా మేలు!

వెళ్తాను, మీ దగ్గరికి రానే రాను
– శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి

Leave a Reply