Take a fresh look at your lifestyle.

కొరోనా సంక్షోభంలో ఫీజుల పెంపు భారమే : హైకోర్టు

రాష్ట్రంలోని పీజీ మెడికల్‌, ‌దంత వైద్య కళాశాలల్లో ఫీజులు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల, పీజీ మెడికల్‌, ‌దంత వైద్య ఫీజులను పెంచుతూ ఇటీవల ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పిల్‌ ‌దాఖలైంది. ఈ పిల్‌పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు కొరోనా సంక్షభంలో ఫీజుల పెంపు నిర్ణయం విద్యార్థులకు భారమేనని వ్యాఖ్యానించింది. ఏ కేటగిరీ విద్యార్థులకు ఫీజుల్లో యాభై శాతం చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

అంతేకాకుండా, బీ కేటగిరీ విద్యార్థులు ఫీజులో 60 శాతం చెల్లించాలని హైకోర్టు పేర్కొంది. ఎన్‌ఆర్‌ఐ ‌కోటా విద్యార్థులు ఫీజు చెల్లించాలని పేర్కొంది. ఇక ఫీజు చెల్లింపులు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసిన హైకోర్టు 4 వారాల్లోగా కౌంటర్‌ ‌దాఖలు చేయాలని టీఏఎఫ్‌ఆర్‌సి, వైద్య కళాశాలలను ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది.

Leave a Reply