Take a fresh look at your lifestyle.

వైద్యులే దేవుళ్ళు

కొరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కుటుంబాలను సైతం వదిలి కొరోనా రోగుల సేవలందిస్తున్నారు. రాష్ట్రంలో కొరోనా మొదటి కేసు నమోదు అయినప్పటి నుండి ఇప్పటి వరకు వైరస్‌ ‌నియంత్రణలో వైద్య సిబ్బంది చేస్తున్న సేవలు ఎనలేనివని చెప్పవచ్చు. కొరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ వ్యక్తిగత సంరక్షణ పాటిస్తూనే రోగులను, కొరోనా అనుమానితులకు సేవలందించడంలో వారి కృషి అభినందనీయం.
రాష్ట్రంలో కొరోనా కేసులు పెరగకుండా
ఉన్న పాజిటివ్‌ ‌కేసులు వ్యక్తులు కోలుకోవడంలో కూడా వైద్య సేవలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కొత్త కొరోనా కేసులు నమోదు కాకుండా నియంత్రించడంలో కేవలం వైద్యల కృషి మాత్రమే నిర్విరామంగా కొనసాగుతున్నదని చెప్పవచ్చు. వైద్యులు, వైద్య సిబ్బంది, ఆసుపత్రులలో పనిచేసే అటెండర్‌ ‌వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం కొరోనా నియంత్రణ  పైనే పోరాడుతున్నారు. అందుకు గుర్తింపుగా ఎయిర్‌ఫోర్స్ ‌దళాలు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 9.30నిమిషాలకు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో కొరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై హెలిక్యాప్టర్‌ ‌ద్వారా పూలుజల్లి వారిని అభినందించనున్నారు. అయితే వారు అందిస్తున్న సేవలకు ఇటువంటి అభినందనలు తక్కువేనని చెప్పవచ్చు. ఎందుకంటే క్షేత్ర స్థాయిలో వైద్యులు కాని, వైద్య సిబ్బంది కాని పూర్తిగా వారి కుటుంబాలను, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి కొరోనాపై పోరాడుతున్నారు. ఇందులో అంతిమంగా విజయాన్ని సాధించడమే వారి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి వారి అందిస్తున్న సేవలకు ప్రతిఫలంగానే రాష్ట్రంలో నేడు కొత్త కొరోనా కేసులు నమోదు కావడం లేదు. ఉన్న పాజిటివ్‌ ‌కేసులు కోలుకొని వారి ఇళ్ళకు వెళ్తుతున్నారు. ఇందులో ఉన్నత స్థాయి వైద్య నిపుణుల నుండి క్షేత్ర స్థాయిలో పర్యటించే ఆశ వర్కర్ల వరకు చేస్తున్న సేవలను వెలకట్టలేనివి. కొరోనా సోకితే స్వంత వారే దగ్గరకు రావడానికే వెనుకడగే వేస్తున్న నేపథ్యంలో కొరోనా రోగులకు, అనుమానితులకు కూడా ఐసోలేషన్‌ ‌వార్డులతో పాటు క్వారంటైన్‌ ‌కేంద్రాలలో కూడా క్షణ క్షణం వారిని గమనించుకుంటూ కంటికి రేప్పాల చూసుకుంటూ నిబంధనల ప్రకారం అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తూ వారు త్వరగా కొరోనా నుండి బయటపడేందుకు అందిస్తున్న సేవలు చరిత్రలో నిలిచిపోతాయని చెప్పవచ్చు.  కొరోనా మహామ్మరిని పారద్రోలేందుకు కృషి చేస్తున్న ప్రముఖ రంగాల్లో  పోలీసులు, సానిటేషన్‌ ‌సిబ్బందితో పాటు వైద్య సిబ్బంది ఎవరికి వారుగా కొరోనా కట్టడిలో భాగస్వాములయ్యారు.

- Advertisement -

నేడు దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు మూతబడ్డాయి. అన్ని రకాల వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. ఎవరూ కూడా బయటకు రావడానికి జంకుతున్న పరిస్థితుల్లో కొరోనా కేసు నమోదు అయినప్పటి నుండి నిర్విరామంగా ప్రభుత్వ వైద్యులు , సిబ్బంది విలువైన సేవలు అందిస్తూ ప్రత్యక్ష దైవాలుగా నిరూపించుకుంటున్నారు.అయితే ఇటువంటి కష్ట కాలంలో వైద్యులు, వైద్య సిబ్బంది కూడా తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ చిన్న పిల్లలు, వృద్దులైన తల్లిదండ్రులకు దూరంగా తమ స్వంత స్వీయ పరిరక్షణలో  వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రజలకు సేవలందిస్తున్నారు. వైద్యులు, వైద్య సిబ్బందికి కూడా కొరోనా సోకిన కేసులు వెలుగు చూశాయి. అయినప్పటికీ ఎక్కడ వెనుకడుగు వేయకుండా ప్రజలను ప్రాణాలను కాపాడేందుకే అహర్నిశలు శ్రమిస్తున్నారు. వైద్య విద్యను అభ్యసించే పిజి వైద్యులు, వైద్య విద్యార్థులు కిరాయికి ఉంటున్న ఇళ్ళను ఖాళీ చేయాలని యాజమానులు ఒత్తిడి చేసిన సంఘటనలు , వైద్యం అందజేస్తున్న వైద్యులపైన దాడులకు దిగిన సంఘటనలు ఎదురయ్యాయి. సమాజంలో వైద్య వృత్తికి విలువైన మరింత పెంపోదించేలా నేటి పరిస్థితుల్లో వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు కాలక్రమంలో కొరోనా నేపథ్యంలో చిరస్థాయిగా నిలిచిపోనున్నారు.
ఎంజిఎం సూపరింటెండెంట్‌ శ్రీ‌నివాసరావు
image.png

ఎంజిఎం కొరోనా వార్డులో పది మంది వైద్య బృందంగా 200ల మంది డ్టార్లు, పిజి వైద్య విద్యార్థులు, జూనియర్‌ ‌వైద్యులు సేవలందిస్తున్నారు. కొరోనా కట్టడికి నిరంతరం వార్డుల్లోనే ఉంటున్నామన్నారు. కొరోనా కోవిడ్‌ ‌వార్డులో 200ల పడకలు, ఐసియు వార్డులో 50 పడకలు, క్వారంటైన్‌ ‌కేంద్రంలో 150 పడకలకు అనుగుణంగా సేవలందిస్తున్నామని ఆయన తెలిపారు.

పారా మెడికల్‌ అసోసియేషన్‌ ‌బాద్యులు : పి.రాధాకృష్ణ
కొరోనా కట్టడికి క్షేత్ర స్థాయిలో పారా మెడికల్‌ ‌సిబ్బంది నిర్విరామంగా పని చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొరోనా పట్ట అవగాహన కల్పించడంతో పాటు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని కొరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ బాధ్యతయుతంగా పని చేస్తున్నాము.

ఆశ వర్కర్స్ ‌యూనియన్‌ ‌జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్‌
‌కొరోనా రోగులను గుర్తించేందుకు నో మూమెంట్‌జోన్‌లో నిత్యం పర్యటించడం జరుగుతుందన్నారు. అధికారుల ఆదేశానుసారం ఇంటింటి సర్వే నిర్వహించడం, రోగులను, చిన్నపిల్లలను, వృద్దులను గమనించడం ద్వారా నో మూమెంట్‌జోన్‌లో పర్యటించడం ద్వారా ప్రమాద పరిస్థితుల్లో కూడా విధులు నిర్వహిస్తున్నామన్నారు.

Leave a Reply