Take a fresh look at your lifestyle.

తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలి..!

దళితుల సాధికారిత లక్ష్యశుద్దిని నిరూపించికోవాలి…
దేశ వ్యాప్తంగా,ప్రపంచ వ్యాప్తంగా కొరోనా విపత్కర పరిస్థితి విద్య,వైద్యం ప్రాధాన్యతను ప్రాముఖ్యతను తెలియజేసిన సందర్భంలో నేడున్నాం. దాన్ని ఒక అనుభవంగా,గుణపాఠంగా తీసుకో వాల్సిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుకు పూర్తిగా విరుద్ధంగా వ్యహరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టమవుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12.5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థులు ఫీజు రీయింబర్సుమెంట్‌ ‌పై ఆధారపడి ఉన్నతవిద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో ప్రతి సంవత్సరం 7.5 లక్షల మంది విద్యార్థులు రెన్యూవల్‌ ‌చేసుకోగా 5 లక్షల మంది విద్యార్థులు కొత్తగా అప్లై చేసుకొంటున్నారు.గత రెండు సంవత్సరాలుగా విద్యార్ధులకి రావాల్సిన 3.816కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించ లేదు. దీనితో ప్రైవేట్‌ ‌కళాశాలల యాజ మాన్యాలు విద్యార్థులను ఫీజులు చెల్లించం డంటూ పట్టుపడుతున్నాయి.ఒకవైపు కొరోనా ప్రభావంతో ఉపాధి కరువై బతుకీడుస్తున్నా తల్లిదండ్రులకు ఆసరా గా నిలుద్దామానుకొని సర్టిఫికెట్స్ ‌కోసం వెళ్లిన విద్యార్థులకు చుక్కె దురైంది, అవుతూనే ఉంది.ఫలితంగా తల్లిదం డ్రులను అడగలేక, యాజమాన్యాలు అడిగే ఫీజులు చెల్లించలేక రీఎంబర్స్మెంట్‌ ‌పై ఆధార పడిన విద్యార్థుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది.అది ఆత్మహత్య దిశగా ప్రయాణి ంచింది.ప్రయాణిస్తుంది అందుకు సాక్ష్యం మొన్న లావణ్య ఆత్మహత్య.

ఉపఎన్నిక వస్తే తప్పా కెసీఆర్‌
‌కి ప్రజలు గుర్తుకురావడం లేదు.ప్రగతి భవన్‌ ‌ను వీడట్లేదు.ఎన్నికల్లో గెలుపుకై ప్రజలకు విచ్చలవిడి హామీల వర్షం కురిపించి ‘‘ఒడ్డుదాటక తెప్ప తగలేసినట్లుగా ‘‘ అమల్లో ఆశల హామీలు ఆడియశాలు అవుతున్నా పరిస్థితి నిత్య కృత్యం మవుతూనే ఉంది.కొత్తగా హుజు రాబాద్‌ ఉపఎన్నిక సందర్భంగా మెజార్టీ ఓటర్లుగా నున్నా దళితులపై కేసీఆర్‌ ‌కన్నుపడి ంది.ఆ ఓట్లు కాజేసేకుట్రకై దళితుల ఉన్నతికరణ, సాదికరత అంటూ గొప్పగొప్ప పదాలు వాడు తున్నాడు. ఎన్నిక డ్రామాల్లో దళితబంధు ఒక ఎర మాత్రమే.అందుకు గత ఎన్నికల హామీలైనా దళిత ముఖ్యమంత్రి, డబుల్‌ ‌బెడ్రూంలు, మూడెకరాల భూమి,ఇంటింటికి మంచి నీళ్లు,లక్ష ఉద్యోగాల భర్తీ,రాష్ట్ర యూని వర్సిటీలను సెంట్రల్‌ ‌యూనివర్సిటీ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నా వాటి అమలు భౌతికస్థితి అనుభవంలోనున్నా విషయమే.

నిజంగా దళితుల ఉన్నతికరణ డబ్బులు పంచి పెట్టడంలో లేదు. డబ్బులు సంపాదించుకునెలా తయారు చెయ్యడంలో ఉంది. గౌరవప్రదమైన జీవితం గడపటం లో ఉంది. అందుకు విద్య,ఉద్యోగాలు ప్రధాన ఆయుధాలు.కానీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగం నిధులను తగ్గిస్తుంది.దళితుల చదువుకు ఉపయోగపడే ఫిజు రీఎంబర్స్మెంట్‌ ‌బకాయిలను 2 సంవత్సరాలుగా పెండింగ్లో పెట్టింది.ఉద్యోగ ప్రకటనలే తప్పా ఖాళీగానున్నా 1.91 పోస్టుల భర్తీ శూన్యం.కావున ప్రభుత్వం విద్యారంగం నిధులు పెంచి,తక్షణమే ఫీ రీఎంబర్స్మెంట్‌ ‌విడుదల చేసి,ఉద్యోగ ఖాళీలు భర్తీచేసి దళితుల ఉన్నతికరణ,సాధికారత లక్ష్యశుద్దిని నిరూపిం చుకోవాలి.
– గడ్డం శ్యామ్‌, pdsu ప్రధాన కార్యదర్శి
హైదరాబాద్‌ ‌రంగారెడ్డి, 9908415381

Leave a Reply