Take a fresh look at your lifestyle.

కేసీఆర్‌ ‌సిఏఏ ప్రకటన మర్మం ఫెడరల్‌ ‌ఫ్రంటేనా..!

“ఈ అం‌శం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది. ఎన్‌ఆర్‌సీ లేదా ఎన్‌ఆర్‌పి అమలుకు రాష్ట్రాలు నిరాకరిస్తే కేంద్రం ఊరుకోకపోవచ్చు. పార్లమెంటు చేసిన చట్టాన్ని రాష్ట్రాలు అమలు చేసి తీరాలి. అయితే, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ ‌విషయాల్లో అలా కాదు ఆ విషయం కేసీఆర్‌కు తెలుసు. మళ్ళీ ఫెడరల్‌ ‌కూటమి కోసం ప్రాంతీయ పార్టీలను సమీకరించేందుకు ఆయన  ఈ ప్రకటన చేశారు. ఆ విషయం ఆయనే అన్నారు.”

పౌరసత్వ సవరణ చట్టం నూరు శాతం తప్పు అంటూ వ్యాఖ్యానించిన తెలంగాణ ముఖ్యంత్రి కే చంద్రశేఖరరావు సీఏఏకి వ్యతిరకంగా అసెంబ్లీ చేత తీర్మానాన్ని ఆమోదింపజేయవచ్చు. ఆయన ప్రకటన మామూలుగా వివాదాస్పద ప్రకటనల వంటిది కాదు. ఆయన అలాంటి ప్రకటన చేసినందుకు మనకు ఆనందం కలగవచ్చు. కానీ, ఆయన అన్న మాటకు కట్టుబడి ఉండేవాడేనా? ఆయన పార్టీ ఎంపీలు సీఏఏకి వ్యతిరేకంగా వోటు వేసిన మాట నిజమే, అంతకుముందు ఆయన చేసిన ప్రకటనలు అనుమానాన్ని కలిగిస్తున్నాయి. కేసీఆర్‌ ‌ఫెడరల్‌ ‌ఫ్రంట్‌ ‌స్థాపన ఆలోచనలు చెదిరిపోయాయి. బీజేపీని అనవసరంగా రెచ్చగొట్టడం ఆయనకు ఇష్టం లేదు. రాష్ట్రానికి కేంద్ర సాయం అవసరం కనుక, ఆయన ఆ విషయాన్ని పక్కన పెట్టి ఉండవచ్చు. బీజేపీ, కేసీఆర్‌ల మధ్య సంబంధాలు ఎప్పుడూ సజావుగా లేవు. ఆయన తటస్థ వైఖరి ఆయనను ఇబ్బందిలో పడవేయవచ్చు. సైద్దాంతికంగా బీజేపీకి తెరాస దూరంగా ఉండాలని ప్రయత్నిస్తోంది.

రాష్ట్ర రాజకీయాల్లో తెరాసకు బీజేపీ ప్రత్యర్ది. సీఏఏకి వ్యతిరేకంగా ఆయన ఎటువంటి ప్రయత్నమైనా చేసి ఉంటే మైనారిటీలను బుజ్జగిస్తున్నారంటూ ఆయనపై బీజేపీ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఉండేది. రాజకీయాలను అలా ఉంచితే, సిఏఏ అమలు చేయమని రాష్ట్రాలు నిరాకరిస్తే కేంద్రం ఊరుకుంటుందా. ఈ అంశం పూర్తిగా కంద్ర ప్రభుత్వ పరిధిలోనిది. ఎన్‌ఆర్‌సీ లేదా ఎన్‌ఆర్‌సీ అమలుకు రాష్ట్రాలు నిరాకరిస్తే కేంద్రం ఊరుకోకపోవచ్చు. పార్లమెంటు చేసిన చట్టాన్ని రాష్ట్రాలు అమలు జసి తీరాలి. అయితే, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ ‌విషయాల్లో అలా కాదు ఆ విషయం కేసీఆర్‌కు తెలుసు. మళ్ళీ ఫెడరల్‌ ‌కూటమికోసం ప్రాంతీయ పార్టీలను సమీకరించేందుకు ఆయన ఈ ప్రకటన చేశారు. ఆ విషయం ఆయనే అన్నారు. ఫిబ్రవరి చివరలో ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఫెడరల్‌ ‌ఫ్రంట్‌ ‌కోసం మరో ప్రయత్నం కోసమే ఈ ప్రకటన అయి ఉండవచ్చు.

Tags: federal front, BJP opponent,Terasa state politics, nrc npr

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply