Take a fresh look at your lifestyle.

‌ప్రజల్లో కొరోనా వ్యాక్సిన్‌పై భయాలు

  • తీసుకోవడానికి అందరూ ముందుకు రాని వైనం
  • ఇప్పటివరకూ 25 లక్షల మందికే టీకా రెండు డోసులు
  • ఆందోళన వద్దంటున్న వైద్య నిపుణులు
  • కొన్ని రాష్రాల్లో పెరుగుతున్న పాజిటివ్‌ ‌కేసులు

మొదటి దశలో ఇప్పటివరకు కోటీ 43డోసుల టీ కాలు వేసారు. కేవలం 25 లక్షల మంది మాత్రమే రెండు డోసులతో పూర్తిగా టీకా స్వీకరించారు. జనాభాలో ఇది ఒక శాతంలో పదోవంతు మాత్రమే. లక్ష్యంగా పెట్టుకున్న జనశ్రేణిలో అందరూ ముందుకు రాలేదని అర్థమవుతూనే ఉన్నది. నిర్దిష్ట వయోశ్రేణిలోని ప్రజలు కోవిన్‌ అప్లికేషన్‌ ‌ద్వారా నమోదు చేయించుకుని, టీకాలు వేయించుకోవాలని ఇప్పటికే ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. టీకా కార్యక్రమం సందర్భంగా వైద్యులను, కోవాగ్జిన్‌ ఆవిష్కరణకు కారకులైన శాస్త్రజ్ఞులను దేశమే కాకుండా ప్రపంచ దేశాలు సైతం ప్రశంసించడం భారత శాస్త్రవేత్తల సత్తాకు నిదర్శనం.

కోవిడ్‌ను భారత్‌ అన్నివిధాల ఎదుర్కున్నదని ప్రపంచం కూడా ప్రశంసించింది. అయితే కొరోనా తెచ్చిన కష్టాలు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉపాధి కోల్పోయి ఇప్పటికీ కోలుకోకుండా ఉన్న చిరుద్యోగులు అనేక వేలమంది ఉన్నారు. కేంద్రసాయం అందక అలమటించిన రాష్ట్రాలు, కొరోనా కాలం ఎటువంటిదో చెప్పగలవు. అయినా ప్రతి ఒక్కరూ అంకితభావంతోనే పనిచేశారు. ఈ దశలో ప్రజల్లో ఉన్న అపోహలు తొలగాలి. ప్రతి ఒక్కరూ టీకా వేయించుకునేందుకు ముందుకు రావాలి.

భయాలతో కూర్చుంటే కొరోనా ఎప్పుడైనా దాడి చేయవొచ్చునని వైద్యులు పదేపదే హెచ్చరిస్తున్నారు. ఇదిలావుంటే గత కొన్ని రోజులుగా దేశంలో రోజుకు 16 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న తరుణంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 12,286 కేసులు నమోదయ్యాయి.

దీంతో మనదేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కొరోనా కేసుల సంఖ్య 1,11,24,527 కి చేరింది. ఇందులో 1,07,98,921 మంది కోలుకొని డిశ్చార్జ్ ‌కాగా, 1,68,358 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొరోనాతో 91 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కొరోనా మృతుల సంఖ్య 1,57,248కి చేరింది.

Leave a Reply