Take a fresh look at your lifestyle.

గ్రామాల్లో అలుముకుంటున్న భయం ముసురు

“మిడతలు మరికొద్ది రోజుల్లో దాడికి దిగితే అధికంగా నష్టపోయేది ఉద్యాన రైతులే.. ప్రస్తుతం ఆహార పంటలు సాగులో లేనందున ఆ పంటలకు గండం తప్పింది.. కానీ జాతీయ ఉద్యాన విస్తీర్ణంలో 3 వది దిగుబడిలో 8 వది అయిన తెలంగాణలో మామిడి, నిమ్మ, బత్తాయి, బొప్పాయి తదిర తోటలతోపాటు కూరగాయ రైతులు గాయాలపాలయ్యే ప్రమాదముంది..సగటున ఒకో మిడత రోజుకు అరకుంట విస్తీర్ణంలో పంట పాడు చేస్తుందని వ్యవసాధికారులు హిస్తుండటంతో కోట్ల లక్షల , కోట్ల సంఖ్యల తుండాలతో దండెత్తే మిడతలు కలిగించే చేటు అంతా ఇంతా కాదని అభిప్రాయపడుతున్నారు..”

మలాథియాన్‌, ‌క్లోరిపైరిపాస్‌, ‌లాండా సైలోథ్రిన్‌, ‌వేల లీటర్ల రసాయనం … అగ్నిమాపక యంత్రాలు, జెట్టింగ్‌ ‌మిషన్లు..శతృ కదలికలపై నిరంతర నిఘా, సరిహద్దుల పహారా.. సీఎం కేసీఆర్‌ ‌బాహుబలి పాత్ర ధరిస్తున్నప్పటికీ.. కాలకేయ సైన్యం పట్ల పల్లె జనుల్లో ఆందోళణ నెలకొంటోంది.. యుద్ధం ఖాయమా.. గెలుపు తద్యమా ఆదుర్దా అధికమవుతోంది.. గ్రామాల్లో మిడత భయం మబ్బు మరింత ముసురుకుంటోంది.. ఖరీఫ్‌ ‌పంటలకూ యుద్ధ గండం పొంచిఉందా అన్న సందేహం పల్లె తలకు తలపాగాలా చుట్టుకుంటొంది.. దాడి జరిగితే పంటల్నే కాదు పశువులకు గ్రాసమూ దక్కించుకోలేని దుస్థితికి గురవుతామా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయ్‌..అదే చోటు చేసుకుంటే నోరులేని మూగజీవాల గతేంకాను అనే దిగులు కళ్ళల్లో ఆవరిస్తోంది..యుద్ధం అనివార్యమైతే రక్షణగా నిలిచేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి తన సమర్ధతను అనుభవపు పెద్దతనాన్ని మరోసారి మాటల్లో నిరూపించుకున్నారు.. ఎదుర్కొనేందుకు సిద్ధపడుతూ ఆదేశాలతోపాటు రైతులకు అప్రమత్తత చర్యలూ సిఫారసు చేశారు..లాక్‌ ‌డవున్‌ ‌సడలించటంతో ఎర్రబస్సూళ్ళలో ఎప్పటిలా రచ్చబండ ముచ్చట్లు మొలుస్తున్నాయ్‌.. ‌భయపడవద్దని ఎదుర్కొని తీరతామని సీ ఎం హామీ ఇస్తున్నప్పటికీ వృత్తాకారపు అరుగుచుట్టూ రవిచెట్టాకుల్లా సంగతులు రాలుతున్నాయ్‌.. ‌చుట్టుకునే చుట్టల్లో ఎక్కడెక్కడి ఊసులో ఎర్రెర్రగా అంటుకుంటున్నాయ్‌.. ‌సందేహాల పొగ అనుమానాల సెగ గుప్పుమంటోంది..అవును తెలుగు పల్లెలన్నీ ఇప్పుడు చర్చా సమయాలవుతున్నాయ్‌..ఈ ‌భయం ముచ్చట్లన్నిటికీ మిడతల దండు కారణమవుతోంది.. ఫ్రం ఆఫ్రికా వయా పాకిస్థాన్‌ ‌పచ్చదనం పై అప్రతిహత దండయాత్ర చేస్తూ.. ఎకరాలెకరాలుగా పొలాలని నమిలేస్తూ రైతును పిప్పిచేస్తున్న మిడతలు..నెక్సట్ ‌మీరే అంటూ తెలుగురాష్ట్రాలకు సవాల్‌ ‌విసురుతుండటంతో.. ఈ ఆందోళణ మొదలయ్యింది…

మహమ్మారి మిడతల సైన్యం ఇప్పటికే మహరాష్ట్ర, రాజస్థా, పంజాబ్‌ ‌లో విజృంభించిన విషయమై మనం ప్రసార మాద్యమాల ద్వార చూస్తున్నాం..అక్కడ కలిగిస్తున్న నష్టం పూర్తికాగానే మహారాష్ట్ర, చత్తీస్‌ ‌గడ్‌, ఒడిసా రాష్ట్రాల గుండా ముందుగా తెలంగాణలోకి ప్రవేశించనుండటంతో… సరిహద్దు జిల్లాలైన భద్రాచలం కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్‌, ‌ములుగు, జయశంకర్‌ ‌భూపల పల్లి, ఆసిఫా బాద్‌, ‌పెద్దపల్లి జిల్లాల్లో నెలకొన్న అధిక ఆందోళణ ఇతర జిల్లాలకూ విస్తరిస్తోంది.. మిడతలు మరికొద్ది రోజుల్లో దాడికి దిగితే అధికంగా నష్టపోయేది ఉద్యాన రైతులే.. ప్రస్తుతం ఆహార పంటలు సాగులో లేనందున ఆ పంటలకు గండం తప్పింది.. కానీ జాతీయ ఉద్యాన విస్తీర్ణంలో 3 వది దిగుబడిలో 8 వది అయిన తెలంగాణలో మామిడి, నిమ్మ, బత్తాయి, బొప్పాయి తదిర తోటలతోపాటు కూరగాయ రైతులు గాయాలపాలయ్యే ప్రమాదముంది.. మామిడి కొన్ని చోట్ల మొదటి కోతలు పూర్తైనా ఇంకా చివరి కాత చెట్లపైనే ఉంది.. లాక్‌ ‌డవున్‌ ఆం‌క్షల ఫలితంగా కూలీల సమస్య రవాణా ఇబ్బందుల దృష్ట్యా ఉద్యాన రైతులు ఇప్పటికే విపరీతంగా పంట నష్టపోయారు.. మామిడి బత్తాయి దిగుబడిని స్థానికంగానే విక్రయంచాల్సి రావటంతో గిట్టుబాటు ధరలకు నోచుకోలేదు.. ప్రతి ఏడాది మాదిరిగా ఢిల్లీ ముంబాయ్‌ ‌తదితర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు సరుకుకోసం రాకపోవటంతో డిమాండ్‌ ‌చేసే పరిస్థితిలేక అగ్గువసగ్గువకు అమ్మజూపారు..

తొలకరి సీజన్‌ ‌లో తెలుగు ఉభయ రాష్ట్రాల్లో లక్షలాది హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి.. వేసంగి పంటల సీజ పూర్తై ఈపాటికే పంటలిళ్ళకు చేరటంతో సమస్య లేకున్నా.. రాబోయే కొద్దిరోజుల్లో తరి పంటల సాగుకు రైతులుపక్రమిస్తారు.. ఇందుకోసం ఈపాటికే గ్రామాల్లో విత్తనాల విక్రయాలూ జరుగుతున్నాయి.. కొన్ని మెట్త ప్రాంతాల్లో పొడి దుక్కుల్లో పత్తి, కంది గింజలను నాటతారు..వర్షం కురిన వెంటనే అవి మొలకెత్తేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తారు.. తెలంగాణ ప్రభుత్వం నియంత్రిత పంటల విధానం అమలు చేయబోతుండటంతో ఎక్కుశాతం ఈ ఏడాది పత్తి సాగు కానుంది.. పత్తి రైతులు ముందుగనే విత్తనాలు విత్తాల్సి ఉండి అయితే ఇందుకు మిడతలభయం అవరోధంగా మారుతోంది..గొల్ల భామ పేరుతో వాస్తవానికి మిడతలు రైతుకు కొత్తేం కాదు.. స్థానికంగా వరి, మిరప, పత్తి సాగులో మిడతల బెడదను రకరకాల పద్దతుల ద్వారా ఎదుర్కుంటూనే ఉంటారు..కానీ ఈ ఏడాది కొత్తగా కోట్ల సంఖ్యలో మిడతలు దాడికి దిగనుండటం వారి భయానికి కారణమవుతోంది.. మిడతల ఆవాస ప్రాతమైన తూర్పు మధ్య ఆఫ్రికా ల్లో వాటికి పర్యావరణ పరంగా ఇబ్బందులు తలెత్తటమో, ఆహార లేమి ఎదురవ్వటమో కారణంగా ఆ సైన్యం ఇలా వలసకు కారణమని ఒక అభిప్రాయం కాగా మిడతల్లో తలెత్తిన హార్మోన్ల అసమతుల్యమూ మరో కారణమని జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ అంచనా వేస్తోంది..

సగటున ఒకో మిడత రోజుకు అరకుంట విస్తీర్ణంలో పంట పాడు చేస్తుందని వ్యవసాధి కారులు ఊహిస్తుండటంతో కోట్ల లక్షల , కోట్ల సంఖ్యల తుండాలతో దండెత్తే మిడతలు కలిగించే చేటు అంతా ఇంతా కాదని అభిప్రా యపడుతున్నారు.. మిడతల దాడి కచ్చితమని చెప్పకపోయిన ముందస్తు అప్రమత్తత సూచిస్తున్నారు.. ప్రకృతి వైపరిత్యాన్నె దుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ రైతుల స్వచ్చంద చర్యలూ ముఖ్యమే అని కొరోనా ఇల్లు దాటి రోడ్డున అడుగుపెట్ట నివ్వకుంటే రాబోయే పరిస్థితులు పొలం వైపు చూడనివ్వని దుస్థితి దాపురిస్తుందా, పంటల సాగుకూ లాక్‌ ‌డవున్‌ ‌సంకెళ్ళు తప్పవా అన్న సంశయంతో అన్నదాతలు బుర్ర గోక్కుంటున్నారు..
– కే.శ్రీనివాస్‌..9346611455

Leave a Reply