Take a fresh look at your lifestyle.

భయం వద్దు..కొరోనా కట్టడి మన చేతుల్లోనే ఉంది

“సామాజిక బాధ్యతలపై స్వార్థం, సంకుచితత్వం, జడలు విప్పి విలయతాండవం చేస్తున్నాయి. ఈ తీరుమారాలి. మానవుడి కనీస కోరికలు, సహజ వనరులు, ప్రకృతి తీర్చగలదు. మితిమీరిన స్వార్థ కోరికల మూలంగానే… నాడు  నేడు ఈ విపత్కర పరిణామాలని గమనించండి. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ నాకు నేనే రక్ష అనే స్వీయ చైతన్యంతోనే కరోనాను కట్టడి చేయాలనే సంకల్పంతో ‘‘జనతా కర్ఫ్యూ’’లను సహకరిస్తూ ఎవరూ బయటికి రాకుండా ఉందాం. సామాజిక దూరం పాటించి, ప్రపంచ యుద్ధాలకన్నా మించిన కరోనా వైరస్‌ను నిర్మూలిద్దాం… డబ్ల్యూహెచ్‌వో సూచనలతో కరోనా కట్టడి మన చేతుల్లో ఉందని నిరూపిద్దాం.”

ఆనాటి ఆది మానవుడి నుండి నేటి ఆధునిక మానవుడి వరకు మనిషి సమూహ(సంఘ)జీవి. మానవజాతి ఆవిర్భావం నుండి గుంపులు గుంపులుగా జీవించారని చరిత్రను పరిశీలిస్తే తెలిసిపోతుంది. అంతెందుకు ప్రతిజీవి తన జాతితో మమేకమై జీవిస్తుంది. ఏ జాతిలో లేని లాగ మనిషికి మనసు, ఉచితానుచితాలు, సుగుణాలు, విద్వత్తు, మానవత్వం, ఆర్థ్రతలు భూషణాల్లాంటివి. వీటి ద్వారా మానవుడు మంచి-చెడులను గ్రహించి ఇతరుల మేలును కోరుకోవాలి. మేలు చేయలేకపోయినా, కనీసం కీడు చేయకుండా ఉండడమే మానవత్వం. మనిషి స్వార్థమును వీడి, నిస్వార్థముతో పరుల హితం కాంక్షించాలి. ప్రపంచంలో ఎక్కువగా చర్చిస్తున్న అంశము ఏదైనా ఉందంటే అది బాహ్యకాలుష్య నివారణకు పాలకులు, స్వచ్ఛంద సంస్థలు ప్రజలను చైతన్య పరిచే విష•యం. పర్యవసానంగా ప్రజల్లో మెల్లమెల్లగా పర్యావరణ స్ప•హ పెరుగుతుంది. ఇది ఎంతో ఆహ్వానించదగ్గ అంశమే అయినా… నేడు ‘‘కరోనా’’ (కోవిడ్‌-19) ‌వైరస్‌ ‌దెబ్బకు ప్రపంచమంతా గడగడలాడుతూ ఎక్కడికక్కడ సకల వ్యవస్థలు స్థంభించిపోతున్నాయి. అన్ని రంగాలు కుదేలౌతున్నాయి. చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ‌వ్యాపిస్తున్న వేగాన్ని, ప్రపంచ దేశాలు తట్టుకోలేక పోతున్నాయి. ప్రాణ నష్టం జరుగుతూనే ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు సైతం వణికిపోతున్నాయి. ఈ కరోనా వ్యాధికి చికిత్స లేదు. వైరస్‌ ‌వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవడమే నివారణ మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా వైరస్‌ ఒక మనిషి నుండి మరో మనిషికి వ్యాప్తిస్తుంది. నివారించాలంటే మనుషుల మధ్య భౌతికంగా దూరం ఉండడం, ఇంట్లోనే ఉండడం కోసం అన్ని సంస్థలకు సెలవులు ప్రకటించింది. ప్రయాణాలు తగ్గించడం, సభలు, సమావేశాలు పెట్టవద్దనడం, కరచాలనం చేయవద్దనడం, తుమ్మినా, దగ్గినా కర్చిప్‌ అడ్డుపెట్టుకోమనడం లాంటివి చేస్తూ వైరస్‌ ‌వ్యాప్తి నివారించవచ్చంటున్నారు.

ఈనాటి ఈ స్థితికి కారాణాలను మూలాల్లోకి వెళ్ళి పరిశీలిద్దాం…బాహ్య కాలుష్యాలవల్ల బయటమాత్రమే ప్రమాదం, ప్రకృతికి పర్యావరణానికి బాహ్య కాలుష్యం వల్ల ఒకరకమైన విపత్తు వస్తుంటే దీని కన్నా భయంకరమైనది భావకాలుష్యం. దీని వలన లోపల, ఇంటా, బయటా అంతటా ప్రమాదం. భావ కాలుష్యం అంటే మనిషిలో స్వార్థం పెరిగిపోయి, తరతమ భేదం లేకుండా ‘‘నేను నా సౌఖ్యం’’ ఇదే నా ప్రపంచం. పరుల కోసం కొంచెమైనా ఆలోచించకుండా ఇతరులు ఏమైపోతే నాకేంది, నేను మాత్రం బాగుంటే చాలనుకునే స్వార్థ నైజం పెరిగిపోతుంది. ఈ పరాకాష్ట వలన పెచ్చరిల్లిన అవినీతి, అన్యాయాలు, అక్రమాలు, నేరాలతో పాటు ప్రకృతిని, భూమిని, పర్యావరణాన్ని తన సొంతం చేసుకోవాలని ఎంత ఘాతుకానికైనా ఒడిగడుతుండడం వల్లనే నేడీ విపత్కర వ్యాధులు, భూకంపాలు, తుపానుల లాంటి పరిణామాలు జరుగుతున్నాయి. మానవుడి విపరీతమైన స్వార్థం వలన మానవజాతి మనుగడకే కష్టకాలం దాపురించింది. ఇది ముమ్మాటికి మానవ తప్పిదమే. అడవులను నరుకుతున్నారు. కాలుష్యాన్ని పెంచుతున్నారు.

- Advertisement -

భూమికి అడుగడుగునా బోర్లు వేసి అంత:పొరలను తెంచుతున్నారు. పంచభూతాలను అమాంతంగా మింగేయాలనే దురాష జడలు విప్పి నాట్యం చేస్తుంది. ఆది మానవుడి సంఘజీవితం నుండి నేడు ఒం•రి జీవితంలోకి మానవుడు వెళ్ళవలసిరావడానికి ఆధునిక మానవుడి ప్రవర్తనే కారణమని తెల్సిపోయింది. అయినా ఇంకా మానవుడిలో మార్పు రాలేదు. బాహ్య కాలుష్యాన్ని నివారించి మనలోని భావకాలుష్యమైన స్వార్థాన్ని వీడాలి. మానవజాతి మనుగడకు ప్రపంచంలో సామ్య్రాకాంక్షలు, ఆధిపత్య పోరు, యుద్ధభయాలు తొలిగిపోయి, ప్రశాంత జీవనానికి బాటపరచాలంటే, మనిషి విచక్షణతో మసులుకోవాలి. కరోనా వ్యాధికి వైద్య సౌకర్యాలు మెరుగు పరుచుకుంటూ, రోగ నిర్థారణ పరీక్ష దేశంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటుచేయడం, పేద కుటుంబాలకు కనీస సౌకర్యాలు ఏర్పరుస్తూ ముందుకు సాగాలి. చైతన్యం చేయడానికి పాలకులు, ప్రజలు సామాజిక బాధ్యతతో మసులుకోవడం నేడు తక్షణ అవసరం. ‘‘చిన్న పామునైనా పెద్ద కట్టెతో చంపాలనే’’ జాగ్రత్తలను విస్మరించడం వలన కరోనా వైరస్‌ ‌విజృంభిస్తుంది. నివారణ దశలు మొత్తం నాలుగు. నాలుగో కీలకదశలోకి వెళ్లకుండా కఠిన నిర్ణయాలు పాటిస్తేనే భారీ విపత్కర మారణ హోమం నుండి •యటపడగలము. శవాల దిబ్బ(స్మశానం)గా మారకముందే మేలుకుందాం.

పాలకులకు, ప్రజలకు కరోనా(కోవిడ్‌ -19) ‌నేర్పుతున్న గుణపాఠం… పర్యావరణ సమతుల్యతను కాపాడాలని, వ్యక్తిగత(వ్యవస్థీకృత)ంగా కాలుష్యంపై నిర్లక్ష్యం వహిస్తే వివిధ రకాల వైరసులు విలయతాండవం చేస్తాయి. అంతేకాదు… ఆరోగ్య భద్రతా వ్యవస్థ(దవాఖాన)లకు ఎల్లప్పుడు పరిపుష్టంగా ఆధునీకరించుకోవాలి..వాటికి ఆర్థిక వనరులను సమృద్ధిగా కేటాయించాలి. యుద్ధం వస్తుందనే భ్రమలో ఆయుధాల కొనుగోలుకు ఎక్కువగా ఆర్థిక కేటాయింపులు పెంచడం కాదు? అంతకన్నా ప్రమాదకరమైన పరిస్థితుల నుండి బయట పడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని హెచ్చరిస్తుంది. ప్రపంచంలోని 780 కోట్ల జనాభాను హడలెత్తిస్తుంది. ప్రతి ఒక్కరు, ప్రపంచం దీక్ష••ని కరోనాను కట్టడి చేద్దాం.. అగ్రరాజ్యాలు ఈ పరిణామానికి కారకులు మీరంటే మీరని ఒకరిపై ఒకరు తోసుకోవడం చూస్తుంటే ఏవరో ఒకరు వినాశకర పరిణామానికి కారణమై ఉండవచ్చనిపిస్తుంది. వ్యక్తి నుండి పాలన వ్యవస్థల వరకు స్వార్థం వీడి సామాజిక బాధ్యతలను శ్రద్ధతో సమర్థవంతంగా ఏ ఒక్క క్షణాన్ని నిర్లక్ష్యం చేయకుండా సంఘటితంగా కరోనా వ్యాప్తిని అరికట్టుదాం. ప్రకృతి, పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఇబ్బడి ముబ్బడిగా వ్యర్థాలను పడవేయరాదు. సామాజిక బాధ్యతలపై స్వార్థం, సంకుచితత్వం, జడలు విప్పి విలయతాండవం చేస్తున్నాయి. ఈ తీరుమారాలి. మానవుడి కనీస కోరికలు, సహజ వనరులు, ప్రకృతి తీర్చగలదు. మితిమీరిన స్వార్థ కోరికల మూలంగానే… నాడు నేడు ఈ విపత్కర పరిణామాలని గమనించండి. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ నాకు నేనే రక్ష అనే స్వీయ చైతన్యంతోనే కరోనాను కట్టడి చేయాలనే సంకల్పంతో ‘‘జనతా కర్ఫ్యూ’’లను సహకరిస్తూ ఎవరూ బయటికి రాకుండా ఉందాం. సామాజిక దూరం పాటించి, ప్రపంచ యుద్ధాలకన్నా మించిన కరోనా వైరస్‌ను నిర్మూలిద్దాం… డబ్ల్యూహెచ్‌వో సూచనలతో కరోనా కట్టడి మన చేతుల్లో ఉందని నిరూపిద్దాం.
సర్వేజనా సుఖినోభవంతు…

Leave a Reply