Take a fresh look at your lifestyle.

రైతులకు త్వరలోనే తీపికబురు చెబుతా…

నయా పైసా లేకుండా ఉచితంగా విద్యత్‌ను అందిస్తున్నాం. అదే తరహాలోనే కాళేశ్వరం నీళ్లు కూడా ఉచితంగానే రైతులకు అందిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆయన స్పష్టం చేశారు. కాళేశ్వరం ఆయకట్టు రైతుల నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి తీరువా వసూలు చేయబోమని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా, తెలంగాణ రైతులకు త్వరలోనే తీపికబురు చెబుతానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రకటించారు. యావత్‌ ‌దేశమే అబ్బురపడే వార్త ఒకటి చెప్పబోతున్నానని ఆయన స్పష్టం చేశారు. వారం రోజుల పాటు సస్పెన్స్ అం‌టూ..భారత్‌లో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి పనిని తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం చేస్తుందన్నారు. ఇందుకు సంబంధించిన ఫైనాన్స్ అం‌శాలు కూడా ఓ కొలిక్కి వచ్చాయని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా అమలు చేయని విధంగా పద్ధతిని అమలు చేయబోతున్నట్టు వివరించారు. తాను కొత్తగా చెప్పబోయే తీపికబురు విని దేశమంతా మరోసారి ఆశ్చర్యపోతారని ఆయన అన్నారు.

త్వరలోనే అదేమిటో తాను చెబుతానని… అప్పటివరకు అంతా వేచి చూడాలని సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు. కేసీఆర్‌ ‌పట్టుబడితే మొండిపట్టు పడుతాడు. రైతులు అద్భుతాలు సృష్టించే రోజులు రాబోతున్నాయి. తక్కువ కాలంలోనే ఆశించిన ప్రగతిని సాధించామన్నారు. ఇరిగేషన్‌ ‌రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. నియంత్రిత సాగు మాత్రమే.. నియంతృత్వ సాగు కాదు అని స్పష్టం చేశారు. నియంత్రిత సాగుకు మద్దతు తెలుపుతూ ఇప్పటికే వేలాది గ్రామాలు తీర్మానం చేశాయి. ముఖ్యమంత్రి బాటే.. మా బాట అని రైతులు తీర్మానాలు చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. దేశానికి మనం ఆదర్శం కావాలి. 530 టీఎంసీల నీళ్లను వాడుకోగలిగే సామర్థ్యాన్ని తెలంగాణ సంతరించుకుంది. మహారాష్ట్రతో ఒప్పందం విషయంలో తెలంగాణ అద్భుతమైన రాజనీతిని ప్రదర్శించి.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని సిఎం కేసీఆర్‌ ‌తెలిపారు.

Leave a Reply