Take a fresh look at your lifestyle.

భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించాలి

మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామ పంచా యతీ పరిదిలో నిర్మించిన మిషన్‌ ‌భగీరధ పైలెట్‌ ‌ప్రాజెక్ట్‌లో భూ ములు ఇచ్చిన దళిత రైతులను ఆదుకోని నష్ట పరిహారం చెల్లిం చాలని కోరుతూ సోమవారం మిషన్‌ ‌భగిరద సందర్శన కోసం వచ్చిన పంచాయతీరాజ్‌ ,‌గ్రామీ ణ నీటి సరఫరా శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అబ్బా యిపాలెం గ్రామా సర్పంచి జినక మణి ఇద్దయ్య వినతి పత్రాన్ని అందించారు .ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ మిషన్‌ ‌భగీరధ నిర్మాణంలో సుమరు ఇరువై ఐదు కుటుంభాలకు చెం దిన నిరుపేద దళితులు ప్రభు త్వంపై నమ్మకంతో తాము సా గు చేసుకుంటున్న వ్యవసాయ భూములను మిషన్‌ ‌భగీరధ ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చారని మణి మంత్రికి వివరించింది.

మిషన్‌ ‌భగీరధ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయి నాల్గు ఏండ్లు గడిచిన వారికీ నష్టపరిహారం అందలేదని వారికీ వ్యవసాయం తప్ప మరొక జీవన ఆదారం లేదని మణి అవేదన్‌ ‌వ్యక్తం చేసింది వారికి వెంటనే ఆదుకోవాలని భూమిని ఇచ్చిన రైతులకు నస్తాపరిహారం చెల్లించి మిషన్‌ ‌భగీరధ ప్రాజెక్టులో ఒక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు .ఈ కర్యరమంలో గ్రామస్తులు మడి పెద్ది రమేష్‌ ,‌నారెడ్డి వెంకట రెడ్డి ,జయరాములు,కుర్యములు వీరాస్వామి,ఎడేల్లి ప్రసాద్‌,‌సైదులు వున్నారు.

Tags: Farmers, lost their, lands should ,be compensated, mission bhagiratha, panchayat raj, errabelli dhayakar rao

Leave a Reply