Take a fresh look at your lifestyle.

26‌న నిర్వహించే ర్యాలీకి సన్నాహకంగా..

  • ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ట్రాక్టర్ల మార్చ్
  • ‌తమ డిమాండ్లను కేంద్రం అంగీకరించకపోతే నిరసన తీవ్రతరం చేస్తామన్న రైతు సంఘాలు

న్యూఢిల్లీ, జనవరి 7: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా,రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా వేలాది మంది రైతులు సింఘు తిక్రీ, ఘాజీపూర్‌ ‌సరిహద్దుల్లో గురువారం ట్రాక్టర్‌ ‌మార్చ్ ‌నిర్వహించారు. సుమారు 3500పైగా ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున ర్యాలీ తీసినట్లు భారత్‌ ‌కిసాన్‌ ‌యూనియన్‌(ఏక్తా ఉగ్రహాన్‌) ‌చీఫ్‌ ‌జోగిందర్‌ ‌సింగ్‌ ఉ‌గ్రహాన్‌ ‌తెలిపారు. జనవరి 26న నిర్వహించే పరేడ్‌లో భాగంగా సన్నాహకంగా ర్యాలీ తీసినట్లు పేర్కొన్నారు. ఉదయం 11 గంటల సమయంలో ట్రాక్టర్‌ ‌మార్చ్ ‌ప్రారంభమె కుండ్లి, మనేసర్‌ ‌పాల్వాల్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌హైవేపై సాగింది. ర్యాలీ నేపథ్యంలో ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లో పోలీస్‌ ‌సిబ్బంది భారీగా మోహరించారు.

- Advertisement -

తమ డిమాండ్లను అంగీకరించకపోతే నిరసన మరింత తీవ్రతరం చేస్తామని కిసాన్‌ ‌మోర్చా సంయుక్త్ ‌కిసాన్‌ ‌మోర్చా సీనియర్‌ ‌సభ్యుడు అభిమన్యు కోహన్‌ ‌పేర్కొన్నారు. తీవ్రమైన చలి, వర్షాలు కురుస్తున్నా పట్టువీడకుండా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో 40 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పంటలకు కనీస మద్దతు ధర, చట్టపరమైన హావి• ఇవ్వాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇరువర్గాల మధ్య  మరోసారి చర్చలు జరుగనున్నాయి. రైతుల ట్రాక్టర్‌ ‌ర్యాలీ నేపధ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ సరిహద్దుల్లో గట్టి భద్రత ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల రైతుల ర్యాలీని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు రైతు సంఘాలు ఆరోపణలు చేసాయి.

Leave a Reply