Take a fresh look at your lifestyle.

వ్యవసాయ చట్టాలపై ‘సుప్రీమ్‌’‌కు రైతులు

కార్పొరేట్లకు బలవుతామని పిటిషన్‌
‌ధరల నిర్ణయం కోసం రైతు కమిటీలు వేయాలని వినతిి

కొత్త వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ ‌శుక్రవారం సుప్రీమ్‌కోర్టు గడప తొక్కింది. ఈ కొత్త చట్టాల వల్ల తాము కార్పొరేట్లకు బలవుతారని రైతులు తమ పిటిషన్‌లో వాదించారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రెండు వారాలుగా దేశ రాజధానిలో పంజాబ్‌, ‌హర్యానా రైతులు ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపినా.. ఫలితం లేకుండా పోయింది. తాజాగా కేంద్రం పంపిన ప్రతిపాదనలను కూడా రైతులు తిరస్కరించారు. ఈ చట్టాలను నిరసిస్తూ.. డిసెంబర్‌ 14‌న దేశవ్యాప్తంగా ఆందోళనలకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఇదే సందర్భంలో భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ ‌బీకేయూ నూతన వ్యవసాయ చట్టాలను సవాల్‌ ‌చేస్తూ సుప్రీమ్‌ ‌కోర్టును ఆశ్రయించింది. ఈ చట్టాలు అమలైతే కార్పొరేట్‌ ‌సంస్థల దురాశకు తాము బాధితులుగా మారిపోతామని ఆందోళన వ్యక్తం చేసింది.

వ్యవసాయోత్పత్తుల ధరల నిర్ణయం కోసం రైతు కమిటీని ఏర్పాటు చేయాలని కోరింది. ఈ మేరకు డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ దాఖలు చేసిన పిటిషన్‌లో ఇంటర్వెన్షన్‌ అప్లికేషన్‌ ‌దాఖలు చేసింది. ఫార్మర్స్ ‌ప్రొడ్యూస్‌ ‌ట్రేడ్‌ అం‌డ్‌ ‌కామర్స్ ‌ప్రొక్యూర్‌మెంట్‌ అం‌డ్‌ ‌ఫెసిలిటేషన్‌ ‌యాక్ట్; ‌ఫార్మర్స్ ఎం‌పవర్‌మెంట్‌ అం‌డ్‌ ‌ప్రొటెక్షన్‌ అ‌గ్రిమెంట్‌ ఆఫ్‌ ‌ప్రైస్‌ అం‌డ్‌ ‌ఫార్మ్ ‌సర్వీసెస్‌ ‌యాక్ట్, ఎసెన్షియల్‌ ‌కమోడిటీస్‌ అమెండ్‌మెంట్‌ ‌యాక్ట్‌లను రైతులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చట్టాలు చట్టవిరుద్ధమని, నిరంకుశత్వంతో చేసినవని, వ్యవసాయోత్పత్తుల వ్యాపారీకరణ, ధరల పెరుగుదలకు బాటలు పరుస్తాయని భాను ప్రతాప్‌ ‌సింగ్‌ ‌నేతృత్వంలోని  బీకేయూ-భాను తన పిటిషన్‌లో ఆరోపించింది.

 ఈ చట్టాలు అమలైతే దేశం నాశనమవుతుందని, కరువు కాటకాలు వొచ్చే ప్రమాదం ఉందని, ఒకేసారి ఎటువంటి నియంత్రణలు లేకుండా వ్యవసాయోత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తారని పేర్కొంది. వ్యవసాయోత్పత్తులకు న్యాయమైన ధరలకు హా ఇస్తున్న అగ్రికల్చరల్‌ ‌ప్రొడ్యూస్‌ ‌మార్కెట్‌ ‌కమిటీల వ్యవస్థ ధ్వంసమవుతుందని తెలిపింది. కార్పొరేట్‌ ‌సంస్థల దయాదాక్షిణ్యాలపై రైతులు ఆధారపడవలసిన పరిస్థితి ఎదురవుతుందని పేర్కొంది. లాభార్జనే ధ్యేయంగా పని చేసే కార్పొరేట్‌ ‌సంస్థలు పేద రైతుల పరిస్థితులను పట్టించుకోవని ఆరోపించింది. చాలా మంది రైతులు నిరక్షరాస్యులైనందువల్ల ప్రైవేటు కంపెనీలతో చర్చలు జరపే సామర్థ్యం ఉండదని, బేరమాడటంలో అసమానతలు తలెత్తుతాయని తెలిపింది. వ్యవసాయోత్పత్తుల ధరల నిర్ణయం కోసం రైతు కమిటీని ఏర్పాటు చేయాలని కోరింది. ఈ కమిటీలో అధ్యక్షుడితో సహా సభ్యులంతా కచ్చితంగా నిజమైన రైతులే ఉండాలని పేర్కొంది.

Leave a Reply