Take a fresh look at your lifestyle.

సమ్మె సెగ రాజుకుంది…!

ఆకాశం నుంచి ఊడి పడ్డవి కావు
ఎవడో ధారదత్తం చేసినవి కావు
ధర్మ బద్దంగా అంకురించిన హక్కుల్ని
మీ నలుపు చట్టాలతో హరింపజూస్తే…
చూస్తూ భరించే వెర్రి బాగులోళ్లం కాదు
మీ చీకటి ‘‘ఎజెండా’’కు జైకొట్టే …
అమాయకులు ఎవరూ లేరిక్కడ
ఉద్యమాల ఊపిరిగా పీల్చినోల్లం
పౌరుషాల ఉగ్గుపాలు పట్టినోల్లం
ప్రాణ త్యాగాలకు వెరవనోల్లం
ప్రతికూలతల అధిగమించినోల్లం
ఏకంగా కాలాలను శాసించినోల్లం
పోరాటాలు మాకు కొత్తేమి కాదు
జైళ్లు ,ఉరి కొయ్యలు ఎరుగగలేము
మీ వాటర్‌ ‌పిరంగులు …
బ్యారికేడ్లు, బందోబస్తులు…
లాఠీలు తూటాల మోతలు …
నిర్బందాలు నిలువరించలేవు …
అదిగో.. అటు చూడు !
హస్తినాపుర సరిహద్దుల్లో…
ఉద్యమ పిడికిలెత్తుకున్నయ్‌
‌ధిక్కార స్వరాలు ఎగుస్తున్నయ్‌
‌నిరసన జెండాలు ఎగురుతున్నయ్‌
‌నాగల్లు, కొడవళ్ళు పదునెక్కినయ్‌
‌ట్రాలీ, ట్రాక్టర్లు దండుగా మోహరించినయ్‌
‌లక్ష్యం ముద్దాడుదాక పట్టు వీడమంటూ…
కర్షక శక్తులు భీష్మించుకు కూర్చున్నయ్‌
‌ప్రజా వ్యత్రిరేక ఏలికలారా..!
అన్నదాత రెక్కల కష్టం కాజేసి
కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెట్టు
మీ నల్ల చట్టాలు ఉపసంహరిస్తే సరి
కాదు కూడదు అంటే…
మీ ఢిల్లీ పీఠాలు కదలక తప్పదు
ఎర్రకోటపై కర్షక జెండా ఎగురుట ఖాయం
(చలో ‘‘ఢిల్లీ’’ రైతు నిరసన కార్యక్రమ నేపధ్యంగా..)
– కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply