Take a fresh look at your lifestyle.

రైతులు అధునాతన వ్యవసాయంవైపు అడుగులు వేయాలి: మంత్రి

సూర్యాపేట, జులై23, ప్రజాతంత్ర ప్రతినిధి): వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులతో ప్రపంచమే తెలంగాణ వైపు చూసేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పథకాలను రూపొందించారని రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని సూర్యాపేట రూరల్‌, ‌పెన్‌పహాడ్‌, ‌చివ్వెంల, ఆత్మకూర్‌ ఎస్‌ ‌మండల కేంద్రాల్లో రైతువేదికల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు  రైతులు అధునాతన వ్యవసాయంవైపు అడుగులు వెయాల్సిన అవసరం ఎంతైన ఉందని ఉద్బోధించారు. రైతుల కొరకు ఏర్పాటుచేసిన రైతు వేదికల ద్వారా రైతు పండించిన పంటకు వారే మద్దతు ధర నిర్ణయించుకోవొచ్చని అన్నారు. దశాబ్దాలుగా రైతాంగాన్ని ఓట్ల బ్యాంక్‌లుగా చూసిన కాంగ్రెస్‌ ‌వంటి పార్టీలకు రైతు బంధు, రైతు బీమాలతోపాటు రైతు వేదికల నిర్మాణాలు, పొలాల వద్ద కల్లాల నిర్మాణాలు కలలో కూడా వచ్చి ఉండేవి కావంటూ ఎద్దెవ చేశారు. 45ఏళ్ళుగా గోదావరి జలాల కోసం ఎదురుచూసిన జిల్లా ప్రజలకు తాము వచ్చిన వెంటనే కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను తీసుకొచ్చామన్నారు. ఒకనాడు నీటి కోసం ధర్నాలు, రాస్తారోకోలు జరిగితే నేడు ఇక నీళ్లు చాలు అన్న రోజులు వచ్చాయని గుర్తుచేశారు.

తెలంగాణ ఏర్పాటు అంటూ జరిగితే చిమ్మచీకట్లు అలుముకుంటాయని, ఉమ్మడి రాష్ట్రం చివరి కిరణం కర్ర పట్టుకొని బోధించిన నాడు ఇక్కడి కాంగ్రెస్‌ ‌నేతలు అందరూ సీమాంధ్రుల మోచేతి నీళ్లు తాగిన వారేనని వివరించారు. 24గంటల కరెంట్‌ అం‌దించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని, రైతు వేదికల ద్వారా రైతులందరూ ఒక్కచోటికి చేరి పండించే పంటలపై చర్చకు దిగితే అద్బుతమైన ఫలితాలు సాధించవొచ్చని పేర్కొన్నారు. పొలాల వద్ద కళ్ళాలు వ్యవసాయ రంగంలో సంచలనాత్మకమైననవని వర్ణించారు. ఈ కార్యక్రమంలో ఎంపి బడుగుల లింగయ్య యాదవ్‌, ‌జిల్లా పరిషత్‌ ‌వైస్‌ ‌చైర్మన్‌ ‌గోపగాని వెంకటనారాయణ, డిసిఎంఎస్‌ ‌చైర్మన్‌ ‌వట్టె జానయ్య, ఎంపిపిలు, జెడ్పిటిసిలు, పిఏసిఎస్‌ ‌చైర్మన్‌లు, డైరెక్టర్లు, రైతు బంధు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply