Take a fresh look at your lifestyle.

నేటి రైతుబంద్‌లో అన్నదాతలు పాల్గొనాలి

ఖమ్మంలో అందుబాటులోకి లకారం మినీ ట్యాంక్‌బండ్‌
‌దివంగత ప్రధాని పివి కాంస్య విగ్రం ఏర్పాటు
లాంఛనంగా ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌
‌పివికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌

ఖమ్మంలో లకారం ట్యాంక్‌ బండ్‌ అం‌దుబాటులోకి వచ్చింది. దానిపై పివి విగ్రహం కూడా నెలకొల్పారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి కెటిఆర్‌ ‌ప్రారంభించారు. మంత్రి కేటీఆర్‌ ‌సోమవారం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రఘునాథపాలెంలో మినీ ట్యాంక్‌బండ్‌ను ప్రారంభించారు. అనంతరం కేటీఆర్‌ ‌మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన ఆరేళ్లలో ఖమ్మం జిల్లా స్వరూపం మారిపోయిందని, బ్రహ్మండమైన అభివృద్ధి జరిగిందన్నారు. ప్లలెల్లో ప్లలెప్రగతి, పట్టణాల్లో పట్టణ ప్రగతి పేరు ద క్రమబద్ధంగా ప్రణాళికా బద్ధంగా ప్రభుత్వం పనిచేస్తూ… ప్లలె, పట్టణం అనే వ్యత్యాసం లేకుండా సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వం అందరినీ కలగలిపి ముందుకు తీసుకువెళుతోందన్నారు. ఇక్కడ మంత్రి పువ్వాడ అజయ్‌తో సహా స్థానిక నాయకులు చక్కగా పనిచేస్తూ అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు.

ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడుకోవచ్చునని, లేనప్పుడు పార్టీలకు అతీతంగా అందరం కలిసిమెలసి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అలాగే రేగులచెలకలో రోడ్డు వైండింగ్‌ ‌పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పువ్వాడ అజయ్‌, ‌మహమూద్‌ అలీ, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, స్థానిక నేతలు పాల్గొన్నారు. లకారం ట్యాంక్‌బండ్‌పై మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌సోమవారం ఆవిష్కరించారు. రూ. 1.25 కోట్లతో పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారని తెలిపారు. పీవీకి భారతరత్న ఇవ్వడమంటే కేంద్రం తనను తాను గౌరవించుకోవడమే అని చెప్పారు.

కేంద్రానికి నిబద్ధత, చిత్తశుద్ధి ఉంటే పీవీకి భారతరత్న ప్రకటించాలన్నారు. రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో పీవీ కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్‌ ‌సెంట్రల్‌ ‌వర్సిటీకి పీవీ పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. పీవీ శతజయంతి సంకలనాన్ని కేటీఆర్‌ ఆవిష్కరించారు. రఘునాథపాలెంలో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ ‌మాట్లాడుతూ.. నేటి భారత్‌ ‌బంద్‌లో తెలంగాణ రైతులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్రం నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలపాలన్నారు. కార్పొరేట్‌ ‌శక్తుల చేతుల్లో రైతులను కార్మికులుగా మార్చే కుట్రను వ్యతిరేకించాలని సీఎం కేసీఆర్‌ ‌పిలుపునిచ్చారు. ధర్నాలు, ఆందోళనలతో కేంద్రానికి నిరసన తెలపాలి. 67 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఖమ్మం చేసి చూపించామని కేటీఆర్‌ ‌తెలిపారు. ప్లలెల్లో ప్లలెప్రగతి ద్వారా, పట్టణాల్లో పట్టణ ప్రగతి ద్వారా బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్‌ ‌వల్లే సాధ్యమైందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడుకుందాం.. ఎన్నికలు లేని సమయంలో అభివృద్ధి విషయంలో అందరం కలిసి ముందుకు పోవాలన్నారు. రఘునాథపాలెం మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఉండాలన్నారు.

Leave a Reply