Take a fresh look at your lifestyle.

పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవద్దు: కలెక్టర్‌

పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఏలాంటి ఇబ్బందులు ఉండకూడదని కలెక్టర్‌ ‌రాజీవ్‌ ‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ ‌మినీ సమావేశ మందిరంలో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై మార్కెట్‌ ‌కమిట్‌ ‌చైర్మన్‌, ‌మార్కెట్‌ ‌శాఖ వ్యవసాయ పోలీస్‌ ‌రవాణా అగ్నిమాపక తూనికలు కొలతలు శాఖల అధికారులతో పాటు జిన్నింగ్‌ ‌మిల్లుల జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షుడితో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ జిల్లాలో 82 వేల ఎకరాలకు పైగా రైతులు పత్తి పంట సాగు చేశారని, సుమారు 90వేల మెట్రిక్‌ ‌టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. గత సంవత్సరం 18 జిన్నింగ్‌ ‌మిల్లులలో సిసిఐ  (కాటన్‌ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా) ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఈ సంవత్సరం 28 జిన్నింగ్‌ ‌మిల్లులలో పత్తి కొనుగోలు  కేంద్రాలు ఏర్పాటు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో అట్టి జిన్నింగ్‌ ‌మిల్లుల నిబంధనల మేరకు కావల్సిన అవసరమైన యంత్రాలు, వసతులు సర్వే చేసి నిబంధనల  మేరకు ఉన్న జిన్నింగ్‌ ‌మిల్లుల వద్ద కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సిసిఐ అధికా రులను కోరారు.

సర్వే పక్రియను తొందరగా చేపట్టాలని సూచించారు. రైతుల డేటాను ఇది వరకే వ్యవసాయ శాఖ రైతుబందు, వెబ్‌సైట్‌ ఆధారంగా గుర్తించాలని సూచించారు. రైతుబంధులో రైతుల వివరాలు లేని రైతుల జాబితా మండల వ్యవసాయ అధికారిగాని వ్యవసాయ విస్తరణ అధికారులు వద్ద డేటాను నమోదు చేయాలని రైతులు  వారి వద్దకు వెళ్లి నమోదు చేసుకున్న తర్వాతే సిసిఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలని కోరారు. ఇతర జిల్లాల నుండి కూడా పత్తి ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ జిల్లాలో ఒక నోడల్‌ అధికారిని నియమించే విధంగా లేఖతో పాటుగా ఆ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడం జరుగుతుందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు సమస్యలు ఎదురైనప్పుడు విన్నవించేందుకు కంట్రోల్‌ ‌రూమ్‌ ఏర్పాటు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద వాహనంలో ఉన్నప్పుడు అన్‌లోడు చేసిన పిదప కూడా మశ్యర్‌  ‌చెక్‌ ‌చేస్తారని రైతులకు ముందస్తుగా అవగాహన కల్పించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే ముందు ని•ందనలు తెలియజేసేందుకు ఆడియో ద్వారాగాని కరపత్రాల ద్వారా గాని ఆయా మీడియా సాధనాలను వినియోగించుకోవాలన్నారు. వెయింగ్‌ ‌మిషన్‌  ‌వద్ద కంప్యూటర్‌ ‌సిసి కెమెరా ఎక్కువ సామర్థ్యం గల ఇంటర్‌నెట్‌  ‌ఫింగర్‌ ‌ఫీట్‌ ‌స్కాన్నర్‌ ఏర్పాటు చేయాలని జిన్నింగ్‌ ‌మిల్లుల యజమానులను కోరారు.

అంతే కాకుండా లేజర్‌ ‌ప్రింటర్‌ ‌కలిబ్రేశన్‌ ‌స్టాంపింగ్‌ ‌వెబ్‌ ‌కెమెరా వేయింగ్‌ ‌మిషన్లను కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించాలని, తూనికలు కొలతల అధికారిని అదేశించారు. అంతే కాకుండా తరచూ తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని, అంతేకాకుండా జిన్నింగ్‌ ‌మిల్లుల వద్ద ఏనుమాముల మార్కెట్‌లో ఏర్పాటు చేసిన అగ్నిమాపక పరికరాలను పరిశీలించాలని, గతంలో మార్కెట్‌లో ఫీట్‌ ‌చేసిన అగ్నిమాపక పరికరాలు ఎక్కువ సామర్థ్యం గల పరికరాలను ఏర్పాటు చేసేందుకు కార్యదర్శితో కలిసి పరిశీలన చేయాలని జిల్లా అగ్నిమాపక అధికారి భగవాన్‌ ‌రెడ్డిని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఏసిపి ప్రతాప్‌ ‌కుమార్‌ను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలు మార్కెట్‌ ఏరియాలో నిరంతరంగా విద్యుత్‌ ‌సరఫరా చేయాలని ట్రాన్స్ ‌కో ఎస్‌సినీ ఆదేశించారు. నవంబర్‌ ‌నెల నుండి పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని వసతులు ఏర్పాట్లు చేయాలని, అంతే కాకుండా కోవిండ్‌ ‌ని•ందనలు పాటించాలని, శానిటైజార్‌, ‌ప్రతి రోజూ హైపో సోడియం క్లోరైడ్‌ ‌పిచ్‌ ‌కారి చేయాలన్నారు. మార్కెట్‌ ‌కమిటీ చైర్మన్‌ ‌చింతల సదానందం మాట్లాడుతూ సీజన్‌లో  మార్కెట్‌లో ఒకే ఒకఫైర్‌ ఇం‌జను ఏర్పాటు చేసినందున మరొకటి ఫైర్‌ ఇం‌జన్‌ ఏర్పాటు చేసి ఎక్కువ సిబ్బంది కూడా ఉండాలన్నారు. అగ్ని మాపక పరికరాలు ఏర్పాటు చేస్తానన్నారు. ఈ సమావేశంలో ట్రాన్స్ ‌కో ఎస్‌సి చౌహాన్‌, ‌మార్కెటింగ్‌ ‌శాఖ జెడి మల్లేశం, డిడి ప్రసాద్‌రావు, కార్యదర్శి, వ్యవసాయ సహాయ సంచాలకులు దామోదర్‌ ‌రెడ్డి, జిల్లా జిన్నింగ్‌  ‌మిల్లుల అసోసియేషన్‌ అధ్యక్షుడు సిహెచ్‌ ‌వీరరావు, సిసిఐ అధికారి ప్రవీణ్‌లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply