కుల్కచర్ల : ధాన్యంకొనుగోలు కేంద్రాలలో మాస్కులు, సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ అన్నారు. మంగళవారం కుల్కచర్ల మండలంలోని పుట్టపహాడ్, పీరంపల్లి వరి కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో రికార్డులను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలలోని ఇంచార్జీలతో మాట్లాడుతూ …కొరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా అందరు సామజిక దూరం పాటిస్తూ మాస్కులు కట్టుకోవాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలని సిబ్బందికి జూచించారు. వరిధాన్యంలో 17 శాతం కంటే తేమ తక్కువ ఉన్న, నాణ్యమైన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి సత్తార్, మహిళా సంఘాల ఇంచార్జీలు, రైతులు ఉన్నారు.