Take a fresh look at your lifestyle.

వాతావరణ మార్పులపై రైతులకు జాగ్రత్తలు చెప్పాలి

రెండు రోజులుగా వస్తున్న వాతావరణ మార్పుల గురించి రైతులకు వారు పండించిన పంటలను తడువ కుండా జాగ్రత్త చేసుకోవడానికి అధికారులు రైతులకు ముంద స్థుగా సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.‌కృష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం కలెక్టర్‌ ‌కార్యాలయంలో అధికారులు, మిల్లర్లతో ధాన్యం కోనుగోలుపై సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా కోనుగోళ్లు చేపట్టాలన్నారు. జిల్లాలో ఏర్పా టు చేసిన 152 ధాన్యం కోనుగో లు కేంద్రాలలో తేమ పరీక్షా యంత్రం, తూకం యంత్రాలు, టార్పాలిన్‌లు ఆందుబాటులో ఉంచాలన్నారు. రైతు సమన్వయ సమితి జిల్లా అద్యక్షులు పల్ల బుచ్చయ్య మాట్లాడుతూ ధాన్యం కోనుగోలులో మండల,గ్రామ స్థాయి రైతు సమన్వయ సమితి సభ్యులను భాగస్వామ్యం చేయ్యాలని,ఈ దిశగా అధికారులు సూచనలు చేయ్యాలన్నారు.కోనుగోల్లలో రైతులు నష్టపోకుండా చూడాలన్నా రు. ఈసమావేశంలో పిడి డిఅర్‌ ‌డిఏ అధికారిణి పారిజాతం,జిల్లా పౌరసరప రాల అధికారి ఆరవిం ద్‌రెడ్డి, సహకార అదికారి విజయ భాస్కర్‌రెడ్డి, డిఎం జిసిసి ప్రతాప్‌, ‌సివిల్‌ ‌సప్లై డిటిలు, మిల్లర్లు పాల్గోన్నారు.

ఇటుక బట్టీల వారు పనులు చేసుకోవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో రాతి క్రషర్లు, ఇటుక బట్టీలు, చేనేత,మరమ్మత్తుల వర్క్ ‌షాపులు తమ పనులు చేసుకోవడానికి లాక్‌డౌన్‌ ‌నుండి మినహయించినట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.‌కృష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పనుల్లో సామాజిక దూరం ,పరిశుభ్రతను పాటిస్తు తమ పనులను చేపట్టుకోవచ్చన్నారు మక్కజోన్న కోనుగోలు కేంద్రాల ఏర్పాటు జిల్లాలోని మక్కజోన్న రైతులు ఇబ్బందులు పడకుండా మరో 4 మొక్కజోన్న కోనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.‌కృష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో తెలిపారు.ములుగు జిల్లాలోని మల్లంపల్లి, రాంచంద్రా పూర్‌, ‌గుర్తురుతండా, అబ్బాపూర్‌ ‌గ్రామాల్లో ఇప్పటికే కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా కోత్తగా నూగూరు వెంకటాపురం మండలంలోని ఉప్పేడు వీరాపూర్‌, ‌మంగపేట మండలంలోని మల్లూ రు, ఏటూరునాగారం మండలం లోని రోయ్యూరు, గోవిందరావు పేట మండలంలోని కర్లపల్లి గ్రా మాల్లో మొక్కజోన్న కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!