Take a fresh look at your lifestyle.

రైతులను ఆదుకోవాలి: సీతక్క

ఇటీవల కురుస్తున్న ఆకాల వర్షాల వలన ములుగు జిల్లాలోని పలు గ్రామాల్లో నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని ములుగు ఎమ్మేల్యే దనసరి సీతక్క అన్నారు. సోమవారం ములుగు జిల్లాలోని జగ్గన్నపేట గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని ములుగు జడ్పీ చైర్మెన్‌ ‌కుసుమ జగదీష్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా సీతక్క మాట్లాడుతూ ఆకాల వర్షాల వలన రైతులు అందోళన చెందుతున్నారని, తాము ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం,ఇతర పంటలు చేతికివస్తున్న సమయంలో ఆకాల వర్షాలు పడటం వలన పంటలను కోల్పోతున్నామని అందోళన వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో జిల్లా అద్యక్షులు నల్లేల కుమారస్వామి, ములుగు ఎంపిపి గండ్రకోట శ్రీదేవి సుధీర్‌, ‌పిఏసిఎస్‌ ‌చైర్మెన్‌ ‌బోక్క సత్తిరెడ్డి, మండల అద్యక్షులు చాంద్‌ ‌పాషా, ఎంపిటిసి మాపురపు తిరు పతిరెడ్డి, ఉప సర్పంచ్‌ శ్రీ‌నివాస్‌, ‌కోండం రవీందర్‌రెడ్డి, శ్యాం,సాంబయ్య, ఐలయ్య, రాజయ్య, ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గోన్నారు.

Leave a Reply