Take a fresh look at your lifestyle.

వానకాలం పంటల సాగుకు రైతులను సమయత్తం చేయాలి

  • వరి ధాన్యం కొనుగోళ్ళు వేగవంతం చేయాలి
  • రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు

సంగారెడ్డి , మే 22 (ప్రజాతంత్ర ప్రతినిధి) జిల్లాలో వానాకాలం పంటల సాగుకు కార్యాచరణకతో సిద్ధం కావాలని సంబంధిత అధికారులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు.శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ, ఖరీఫ్ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు. వానా కాలం సాగుకు రైతుల‌ను స‌మాయ‌త్తం చేయాల‌ని వ్య‌వ‌సాయ శాఖ అధికారుల‌కు సూచించారు. పచ్చి రొట్ట విత్తనాల సాగు పెంచాలని, ఆ దిశగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులను చైతన్యం చేయాలన్నారు.

రైతులకు ఇబ్బంది కలగకుండా ఎరువులు, విత్తనాలు అందుబాటులో పెట్టుకోవాల న్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎరువుల బఫర్ స్టాక్ ను అందుబాటులో ఉంచాలన్నారు. ఎరువుల ధరలుపెరిగాయని, పచ్చిరొట్ట విత్తనాల సాగు తో రైతులకు ప్రయోజనం ఉందని, భూమి సారం పెరగడమే కాకుండా ఆర్థిక భారం పడకుండా ఉంటుందని మంత్రి సూచించారు.వెదజల్లే పద్ధతి లో వరి సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. ఈ పద్ధతి సాగు వల్ల దిగుబడి పెరుగుతుందని పెట్టుబడి తగ్గి రైతుకు ఆదాయం చేకూరుతుందన్నారు. జిల్లాలో కనీసం 25 వేల ఎకరాలలో వెదజల్లే పద్ధతిలో వరి సాగు అయ్యేలా ప్రణాళిక చేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.వానకాలం రైతుబంధు కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలన్నారు.

రైతు బీమాకు సంబంధించి ఆయా రైతుల కుటుంబాలు ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు బీమా డబ్బులు అందేలా చూడాలన్నారు.జిల్లాలో 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కు సంబంధించి ట్యాబ్ ఎంట్రీ పూర్తిచేయాలని, ఎక్కడ పెండింగ్ ఉండకూడదని, చెల్లింపులు వేగంగా చేయడం పై దృష్టి సారించాలని డి ఆర్ డి ఓ, డి సి ఓ, సివిల్ సప్లై డి ఎం నకు ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా ఈ పూర్తి చేయాలని ఆయన తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని మంత్రి తెలిపారు.

ఈ సమీక్షలో ఎంపీ బీబీ పాటిల్, ఎం ఎల్ సి భూపాల్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ రాజర్షి షా, వీరారెడ్డి,మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి, డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, సివిల్ సప్లయ్స్, మార్క్ఫెడ్, డి ఆర్ డి ఓ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply