Take a fresh look at your lifestyle.

పంటసాగుపై రైతులకు అవగాహన కల్పించాలి

సూర్యాపేట, మే 26, ప్రజాతంత్ర ప్రతినిధి):జిల్లాలో ఈ వానాకాలం వరిపంటతో పాటు కంది, ప్రత్తి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ‌డి. సంజీవరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌ ‌కార్యాలయంలో పంటల సాగు విధానం, పంట మార్పిడి, నీటి లభ్యత, రైతులకు శిక్షణ వంటి కార్యక్రమాలపై అధికారులతో ఏర్పాటుచేసిన  సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు సాగు చేయాల్సిన పంటలపై జిల్లా నుండి గ్రామల స్థాయి వరకు మైక్రోప్లాన్‌ ‌రూపొందించడం జరిగిందని తెలిపారు.

ప్రతి పండించే రైతులు, అందులో కందిని అంతర్‌ ‌పంటగా పండించాలని, కందిని ప్రధాన పంటగా పండిచే రైతులు పెసరను అంతర్‌ ‌పంటగా పండించాలని  ఆదిశగా ప్రణాళికలను రూపొం దించడం జరిగిందని పేర్కొన్నారు. ఇట్టి ప్రణాళిక ఉపయోగపడేందుకు నేరుగా విత్తనాలు వియ్రించే డీలర్లు ఎవరైతే ప్రతి పండిస్తారో వారికి కంది విత్తనాలను, కంది పంటను వేసేవారికి పెసర వంటి విత్తనాలను అందజేస్తారని వివరించారు. అలాగే రైతులకు సాగు చేయాల్సిన వాటిపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. కొత్తగా నీటి సౌకర్యం పొందే రైతులు వరిని కాకుండా ప్రతి, కంది వంటి పంటలను పండించాలని అన్నారు. పంటల సాగుపై ఈ నెల 27న జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తు న్నామని వెల్లడించారు. అదే విధంగా గ్రామ స్థాయి సమావేశాలు 28 ఉండి 30వరకు నిర్వహిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో సంయుక్త సంచాలకులు వేణు మనోహర్‌, ‌జిల్లా వ్యవసాయ అధికారి జ్యోతిర్మయి, సంధ్యారాణి, రామరావు, జగ్గు నాయక్‌, ‌భద్రునాయక్‌ ‌పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!