Take a fresh look at your lifestyle.

పలు రాష్ట్రాల్లో రైతుల రైల్‌ ‌రోకో

భారీగా పట్టాలపై పడుకుని నిరసన
వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్‌
‌త్వరలో దేశవ్యాప్తంగా పంచాయితీ, మహా పంచాయితీ

సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం చేస్తున్న రైతులు తమ ఉద్యమంలో భాగంగా గురువారం ’రైల్‌ ‌రోకో’ నిర్వహించారు. పంజాబ్‌, ‌హర్యానా, యుపి, మహారాష్ట్ర, కర్ణాటక రాష్టాల్లోన్రి పలు రైల్వే ట్రాక్‌లపై వేలాదిగా రైతులు చేరుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వం పలు ప్రాంతాల్లో రైళ్ల సర్వీసులను నిలిపివేసింది. పంజాబ్‌, ‌హర్యానాల్లో రైల్వేపోలీసులతో పాటు రాష్ట్ర పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేసింది. సాగుచట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలోని ఘజియాబాద్‌ ‌సరిహద్దులో వేలాది మంది రైతులు గత ఏడాది నవంబర్‌ ‌నుండి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ ఉద్యమంలో భాగంగా రైతులు రైల్‌ ‌రోకో చేపట్టారు. పంజాబ్‌, ‌హర్యానా, ఉత్తరప్రదేశ్‌, ‌బిహార్‌, ‌రాజస్థాన్‌, ‌మధ్యప్రదేశ్‌ ‌తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో రైల్‌ ‌రోకో విజయవంతమైంది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత 85 రోజులుగా ఉద్యమిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించిన రైల్‌ ‌రోకో కార్యక్రమాన్ని సాయంత్రం 4 గంటల వరకు చేపట్టారు. హర్యానా, పంజాబ్‌లో రైల్‌ ‌రోకో ఎక్కువ ప్రభావాన్ని చూపినట్లుగా సమాచారం.

పలు పెద్ద నగరాల్లో నిరసనకారులు రైల్వే ట్రాక్‌లపై కూర్చుని రైళ్ల రాకపోకలు జరుగకుండా చూశారు. రాజస్థాన్‌లోని జైపూర్‌తోపాటు సవి•ప ప్రాంతాలలో కూడా రైళ్లు నిలిచిపోయాయి. రైతుల ఆందోళన ప్రభావం జైపూర్‌లోని జగత్‌పుర రైల్వే స్టేషన్‌లో స్పష్టంగా కనిపించింది. రైల్‌ ‌రోకో సందర్భంగా వృద్ధులు, చిన్నారులు, మహిళలు ఇబ్బందిపడకుండా రైళ్లలో నీరు, బిస్కట్ల పంపిణీని కూడా రైతులు చేపట్టారు. జైపూర్‌లోని గాంధీనగర్‌ ‌రైల్వే స్టేషన్‌ ‌వద్ద నిరసనకారులు రైలును ఆపారు. జగత్‌పురా స్టేషన్‌లో కూడా ప్రదర్శనలు జరిపారు. జైపూర్‌ ‌జిల్లాలోని చౌమున్‌ ‌రైల్వే స్టేషన్‌ ‌వద్ద ఆందోళనకారులు ట్రాక్‌లపై కూర్చుని నిరసన తెలిపారు. అల్వార్‌లో కూడా రైళ్లు నిలిపివేశారు. రైలు రోకో ప్రభావం రాష్ట్రంలోని 6 జిల్లాల్లో కనిపించింది. హర్యానా పానిపట్‌లోని టీడీఐ సిటీ సవి•పంలో వంతెన కింద ట్రాక్‌పై రైళ్లు నిలిచిపోయాయి.

అక్కడ రైతులు ట్రాక్‌ ‌వి•ద కూర్చుండి నిరసన తెలిపారు. మధ్యాహ్నం 12.45 గంటలకు చేరుకున్న బాంద్రా-అమృత్‌సర్‌ ‌పశ్చిమ్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌రైలును నిరసనకారులు ఆపారు. హర్యానాలో నిరసనకారులు సుమారు 80 ప్రదేశాలలో రైల్‌ ‌రోకో చేపట్టారు. పంజాబ్‌లోని 15 జిల్లాల్లో 21 చోట్ల రైతులు రైళ్లను ఆపారు. పాటియాలా జిల్లాలో నాభా, సంగ్రూర్‌లోని సునం, మన్సా, బర్నాలా, బతిండలోని రాంపూరా, మండి, సంగత్‌, ‌గోనియానా, ఫరీద్‌కోట్‌లోని కోట్కాపురా, ముక్త్సర్‌లోని గిద్దర్‌బాహా, అబిహార్‌, ‌ఫజిల్కాలో జలాలాబాద్‌, ‌మోగాలోని అజిత్వాల్‌, ‌జలంద్‌ అమర్తార్‌లలో రైళ్లు నిలిపేశారు. బిహార్‌లో రైతుల రైల్‌ ‌రోకో నిర్వహించారు. వీరికి పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నాయి. పాట్నాలో జన అధికార్‌ ‌పార్టీ(డెమొక్రాటిక్‌) ‌కార్యకర్తలు నిర్ణీత సమయం కన్నా అరగంట ముందు రైలును ఆపడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

ఎన్‌సీఆర్‌లో రైతుల ఆందోళన నేపథ్యంలో మెట్రో రైలు నిర్వహణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. తిక్రీ బోర్డర్‌ ‌మెట్రో స్టేషన్‌, ‌పండిట్‌ శ్రీ‌రామ్‌ ‌శర్మ, బహదూర్‌గఢ్‌ ‌సిటీ, బ్రిగ్‌ ‌హోషియార్‌ ‌సింగ్‌ ‌మెట్రో స్టేషన్‌ ‌మూసివేశారు. రైల్‌ ‌రోకో చేపడుతున్నట్లు రైతు సంఘాల ప్రతినిధులు ప్రకటించడంతో భారీగా పోలీసులను మోహరించారు. రైల్వే ప్రొటెక్షన్‌ ‌స్పెషల్‌ ‌ఫోర్స్ (ఆర్పీఎస్‌ఎఫ్‌) 20 అదనపు కంపెనీలను దేశవ్యాప్తంగా మోహరించారు. వీరిలో ఎక్కువ మంది పంజాబ్‌, ‌హర్యానా, ఉత్తర ప్రదేశ్‌, ‌పశ్చిమ బెంగాల్‌లో మోహరించారు.

అంతకుముందు శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించాలని నిరసనకారులకు రైల్వే ప్రొటెక్షన్‌ ‌ఫోర్స్‌కు చెందిన డీజీ అరుణ్‌ ‌కుమార్‌ ‌విజ్ఞప్తి చేశారు. రైళ్లలో ప్రయాణించే వారికి ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా చూడాలని ఆయన సూచించారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్‌ ‌చేశారు. తమ సంస్థ రైతుల ప్రయోజనాల కోసం పోరాడుతుందని, కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు ఇండ్లకు తిరిగి వెళ్లబోమని భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ (‌హర్యానా) అధ్యక్షుడు గుర్నమ్‌ ‌సింగ్‌ ‌చాండుని ప్రకటించారు. దేశవ్యాప్తంగా పంచాయతీ, మహా పంచాయతీ వంటి కార్యక్రమాలను చేపట్టి రైతులను ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తామన్నారు.

Leave a Reply