Take a fresh look at your lifestyle.

రైతుల నిరసనలు కొనసాగుతాయి

  • బలవంతంగా తొలగించడం సాధ్యం కాదు
  • భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌
  • ‌ఢిల్లీ సరిహద్దులో నిరసన ప్రదేశంలో బానికేడ్లు తొలగొంచిన పోలీసులు

న్యూఢిల్లీలోని ఢిల్లీ-ఉత్తరప్రదేశ్‌ ‌సరిహద్దుకు సమీపంలోని ఘాజీపూర్‌లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌(‌బీకేయూ) ప్రధాన కార్యదర్శి యుధ్వీర్‌ ‌సింగ్‌ ‌తెలిపారు. శుక్రవారం ఢిల్లీ పోలీసులు ఘాజీపూర్‌ ‌సరిహద్దులో బారికేడ్లను తొలగించడంపై యుధ్వీర్‌ ‌సింగ్‌ ‌స్పందిస్తూ, ఘాజీపూర్‌ ‌సరిహద్దులో మరింత ఉత్సాహంతో నిరసన కొనసాగుతుందని చెప్పారు. రైతులు మునుపటిలా సరిహద్దుకు వస్తూనే ఉంటారని అన్నారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనను శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం రైతులకు చేరువ కావడానికి ఈ చర్య ప్రతికూలమని ఆయన అన్నారు.

ప్రభుత్వం సమస్య పరిష్కారానికి ఒక నిర్ణయానికి రాకుండా దానిని మరింత సాగదీయాలని కోరుకుంటుందని రైతుల ప్రయోజనాల కోసం నిరసనలు చేయడంలో తన 40 సంవత్సరాల అనుభవం తనకు ఈ సందర్భంలో చెబుతుందని అన్నారు. సామాన్య ప్రజలకు సమస్యలు సృష్టించాలని రైతులు ఎప్పుడూ కోరుకోలేదన్నారు. జనవరి 26 సంఘటన తర్వాత ఢిల్లీ పోలీసులే ఈ బారికేడ్లను పెట్టారని, సుప్రీమ్‌ ‌కోర్టు ఆదేశాల తర్వాత వాటిని వేరే తొలగించినట్లు తెలుస్తుందని అన్నారు. అంతకుముందు, బికెయూ నేత• రాకేష్‌ ‌టికైత్‌ ‌మీడియాతోతో మాట్లాడుతూ.. బారికేడ్లను తొలగించిన తర్వాత, వివాదాస్పద వ్యవసాయ చట్టాలు చేసిన పార్లమెంటుకు రైతులు తరలివెళతారని చెప్పారు. సంయుక్త కిసాన్‌ ‌మోర్చా సమావేశమై ఈ విషయంపై పిలుపునిస్తుందని సింగ్‌ ‌చెప్పారు.

రైతుల డిమాండ్లకు సంబంధించినంతవరకు కేంద్రానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఎటువంటి తేడాను తాము చూడలేమని సింగ్‌ అన్నారు. బలవంతంగా తమను తొలగించడం సాధ్యం కాదని, చర్చలొక్కటే పరిష్కారం చూపుతాయని బికెయూ నేత రాజ్‌వీర్‌ ‌సింగ్‌ అన్నారు. వారు అత్యవసర వాహనాలకు దారి ఇవ్వడం కొనసాగిస్తారని ఆయన చెప్పారు.

Leave a Reply