Take a fresh look at your lifestyle.

కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆందోళన ..!

వికారాబాద్ జిల్లా దోమ మండలం పాలేపల్లిలోని వరి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. వరి ధాన్యాన్ని రోడ్డుపై కుప్పగా పోసి నిప్పుపెట్టి తగల బెట్టారు. వెంటనే తమ ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన తెలుపుతున్నారు.
గని బ్యాగ్ తీసుకునే నాటినుంచి వడ్లు తూకం వరకు రైతులను దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది పదిహేను రోజులుగా ధాన్యం తెచ్చి కొనుగోలు కేంద్రం వద్ద కుప్పలుగా ఉంచామని… వరిధాన్యం మొలకెత్తి పోతుందని దీంతో తాము తీవ్రంగా నష్టపోతామని వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల నిరసన విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా ఓ రైతు ఎస్సై కాళ్లపై పడి రోదిస్తూ తమని ఆదుకోవాలని వేడుకున్నాడు.
ప్రతి 40 కేజీల బస్తాకు తరుగు పేరుతో రెండు నుంచి ఐదు కిలోల వరకు తగ్గిస్తున్నారని… ఇలాగైతే తమకు ఏమి మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.  తానేమీ చేయలేనని పై అధికారులు చెప్పిన విధంగా తాను నడుకుంటున్నానని ఐకేపీ సెంటర్ నిర్వాహకుడు చేతులెత్తేశాడు.

Leave a Reply