Take a fresh look at your lifestyle.

ఢిల్లీలో ఉద్రిక్తంగా రైతుల ‘ మార్చ్’

  • వాటర్‌ ‌కెనాన్‌, ‌టియర్‌ ‌గ్యాస్‌లతో అడ్డుకున్న పోలీసులు
  • ఎట్టకేలకు నిరంకారీ భవన్‌ ‌వరకు అనుమతి

ఆం‌దోళన చేస్తున్న రైతులను ఢిల్లీలోకి రావడానికి అనుమతిస్తున్నట్లు పోలీస్‌ ‌కమిషనర్‌ అలోక్‌ ‌కుమార్‌ ‌వర్మ తెలిపారు. అయితే రైతులు తమ నిరసనలను శాంతియుతంగా జరుపుకోవాలని అన్నారు. వారికి బురారీ ప్రాంతంలోని నిరంకారీ సమాగమం మైదానాన్ని నిరసన తెలుపు కోవడానికి కేటాయించినట్లు అలోక్‌ ‌చెప్పారు. పంజాబ్‌కు చెందిన క్రాంతికారీ కిసాన్‌ ‌యూనియన్‌ అధ్యక్షుడు దర్శన్‌ ‌పాల్‌ ‌స్పందిస్తూ.. తమను ఢిల్లీలోకి అనుమతించినట్లు తెలిపారు. తాము మొదట రామ్‌లీలా మైదానంలో నిరసన తెలుపుతామని కోరినా పోలీసులు నిరాకరించారని, ఇప్పుడు తామంతా బురారీ ప్రాంతానికి వెళ్తున్నట్లు భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ (‌రాజేవాల్‌) అధ్యక్షుడు బల్బీర్‌ ‌సింగ్‌ ‌రాజేవాల్‌ ‌చెప్పారు.

రైతులను ఢిల్లీలోకి అనుమతించడాన్ని పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి అమరీందర్‌ ‌సింగ్‌ ‌స్వాగతించారు. కేంద్రం వెంటనే రైతులతో చర్చలు మొదలుపెట్టాలని సూచించారు. ఇదిలావుంటే  కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ’ఢిల్లీ చలో’ మార్చ్‌లో భాగంగా ఢిల్లీ సరిహద్దుకు చేరిన రైతులను చెదరగొట్టేందుకు ఢిల్లీ పోలీసులు శుక్రవారం టియర్‌ ‌గ్యాస్‌ ‌ప్రయోగించారు. సరిహద్దుల్లో భారీగా చేరుకున్న రైతులు, బలగాల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీని హర్యానాతో కలిసి సరిహద్దు పాయింట్‌ ‌వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పోలీస్‌ అధికారి మాట్లాడుతూ కొవిడ్‌ ‌మహమ్మారి నేపథ్యంలో ఎలాంటి ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని తెలిపారు. నిరసన తెలుపుతున్న రైతులను చెదరగొట్టేందుకు టియర్‌ ‌గ్యాస్‌ ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.

 

ఢిల్లీకి వచ్చేందుకు అనుమతి ఇవ్వడం లేదని, వచ్చేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. సరిహద్దు వద్ద భద్రతను బలోపేతం చేశామని, ఇసుకతో నింపిన ట్రక్కులు, వాటర్‌ ‌కెనాన్‌లను అందుబాటులో ఉంచారు. అలాగే నిరసనకారులు రాజధానిలోకి రాకుండా నిరోధించేందుకు ముళ్లకంచెలను సైతం ఏర్పాటు చేశారు. 30కిపైగా రైతు సంఘాలు రైతులు లాల్రూ, శంభు, పాటియాలా-పె•వా, పత్రాన్‌-‌ఖానౌరి, మూనక్‌-‌తోహానా, రతియా-ఫతేహాబాద్‌, ‌తల్వాండి-సిర్సా తదితర మార్గాల ద్వారా ఢిల్లీ వెళ్తామని ప్రకటించారు. పెద్ద సంఖ్యలో రైతులు సరిహద్దులకు చేరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉదయం హర్యానా శివారులో రైతులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. మరో వైపు రైతుల ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొని పోలీసుల వాహనాలు తనిఖీ చేస్తుండడంతో ఢిల్లీ-గురుగ్రామ్‌ ‌వద్ద భారీగా ట్రాఫిక్‌ ‌జామ్‌ అయ్యింది. అలాగే బోర్డర్‌లో సీఐఎస్‌ఎఫ్‌ ‌సిబ్బందిని భారీగా మోహరించారు. ఢిల్లీ – బహదూర్‌గఢ్‌ ‌సపంలో తిక్రీ సరిహద్దు వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్‌ ‌కెనన్‌, ‌టియర్‌ ‌గ్యాస్‌ ‌ప్రయోగించారు. ఢిల్లీకి వెళ్లేందుకు భద్రతా బలగాలతో ఘర్షణకు దిగారు.

Leave a Reply