దంచికొట్టిన వర్షాల వలన
పంటలు నీటమునిగినయ్
పిడుగులు వడగండ్లతో
పండ్లు ఫలాలు నేలరాలి
ఆశల గల్లంతుజేసినయ్
చేతికందిన ధాన్యాలు
బురద మట్టి పాలైనయ్
కర్షకుల శ్రమ ఫలాలు
అందకుండా పోయినయ్
ఇపుడు అన్నదాతల
గుండెలు రోధిస్తున్నాయ్
మెతుకు పెట్టే చేతులు
సాయనికి ఆర్తిస్తున్నాయ్
మొత్తంగా సేద్యజీవుల
బతుకులు అగమైనయ్
ఆపన్న హస్తాలు లేక
ఒడవని దుఃఖం మిగిలి
చావును ఆశ్రయిస్తున్నయ్
రాజ్యమేలే పాలకులారా
మొసలి కన్నీరు ఆపండి
నక్క జిత్తులను మానండి
బూటక డ్రామా ప్రదర్శనలు
కుళ్లు పాలిటిక్స్ కట్టేయండి
రాష్ట్రం దేశాన్ని ఉద్దరిచ్చే
ఉత్తముచ్చట చాలించండి
ఇకనైనా సోయికి వచ్చి
పంట నష్ట పరిహారం చెల్లించి
తడిసిన ధాన్యం కొనుగోలు చేసి
అన్నదాతకు బాసటగా నిలవండి
సాగుబాటుపై చిత్తశుద్ధిని చాటండి
( వడగండ్ల వానల బాధిత రైతాంగానికి బాసటగా…)
– కోడిగూటి తిరుపతి, 9573929493