Take a fresh look at your lifestyle.

ధాన్యం అమ్ముకోలేక రైతుల ఆవేదన

తడిసిన ధాన్యం అమ్మకాల్లో ఆలస్యం
కడియం ప్రాంతంలో రైతులను పరామర్శించిన పవన్‌

‌ ధాన్యం ఎంత పండించినా..ఐనకాడికి ధాన్యం అమ్ముకునే పరిస్థితులు వచ్చాయంటూ జనసేనాని పవన్‌ ‌కళ్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తడిసిన ధాన్యం అమ్ముకునేందకు నానా తిప్పలు పడుతున్నారని అన్నారు. రైతులతో సుదీర్ఘంగా మాట్లాడిన పవన్‌.. ‌రైతులు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు.. అకాల వర్షాల వల్ల కలిగి పంట నష్టంతో పాటు.. ధాన్యం కొనుగోళ్లలో ఎదుర్కొంటున్న సమస్యలను పవన్‌  ‌రైతులు దృష్టికి తీసుకెళ్లారు..తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ ‌కల్యాణ్‌ ‌పర్యటించారు. రాజమండ్రి రూరల్‌ ‌నియోజకవర్గంలోని కడియం ఆవలో అకాల వర్షాలతో పంటలు దెబ్బ తిన్న రైతాంగాన్ని పరామర్శించి, మొలకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు.. వి•రు వస్తున్నారని ధాన్యం కొనుగోలు వేగవంతం చేశారని పవన్‌కి రైతులు తెలిపారు.

అన్నదాతలకు న్యాయం జరిగే వరకు పోరాడతానని పవన్‌ ‌కళ్యాణ్‌  ‌హావి• ఇచ్చారు.  ఇంకా కోతలు కోయాల్సి వుందని, గోనె సంచులు ఇవ్వడంలేదు గోడు వెళ్లబోసుకున్నారు.. నూక , ట్రాన్స్ ‌పోర్ట్ ‌పేరుతో రైతులని మిల్లర్లు దొచేస్తున్నరని పవన్‌ ‌కల్యాణ్‌ ‌ముందు కన్నీరుమున్నీరయ్యారు..  అంతకుముందు రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ ‌కల్యాణ్‌కు స్వాగతం పలికాయి జనసేన శ్రేణులు.. అక్కడి నుంచి రాజమండ్రి నగరం బొమ్మూరు రాజవోలు వి•దుగా రాజమండ్రి రూరల్‌ ‌నియోజక వర్గంలోని ఆవ భూములలో దెబ్బ తిన్న వ్యవసాయ భూములు పరిశీలించి రైతులను మాట్లాడారు పవన్‌. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని రైతులు పవన్‌ ‌కళ్యాణ్‌ ‌కు వివరించారు.

Leave a Reply