Take a fresh look at your lifestyle.

రైతు బంధువు కేసీఆర్‌..!

  • బీమాతో అన్నదాత కుటుంబానికీ భరోసా
  • పంటకు రైతుబందు,నామినీకి రైతు బీమా

స్వాతంత్య్ర దినోత్సవం రోజున అన్నదాతలకు అండగా రైతు బందువు కేసీఆర్‌ ‌హట్రిక్‌ ‌పథకాలను ప్రారంభించి, దూసుకపోతున్న తీరుకూ యావత్త్ ‌భారతదేశం నివ్వెర పోయేలా ఉంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత రైతుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ది కార్యక్రమాలు ఊహకు అందని విదంగా ఉన్నాయంటే రైతులకే ఆశ్చర్యం కలిగే విదంగా ఒకటికాదు, రెండుకాదు, ఏకంగా 40 సంక్షేమ పథకాలతో 29 రాష్ట్రాలలోనే ప్రత్యేకతను కనబర్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు తనదైన శైలీలో పరిపాలన నడిపిస్తూ,అనుభవం గడించిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకే ఆదర్శంగా నిలువడం అనేది తెలంగాణ అభివృద్దికి చిహ్నంగా చెప్పవచ్చును.ఒకానోక దశలోతెలంగాణలోని నాయకులకు పరిపాలన రాదు అని వ్యంగ్యంగా ఆహంకారంతో మాట్లాడిన నాయకులకు కేసీఆర్‌ ‌పాలన చెంపపెట్టుఅని విద్యావేత్తలు అభిప్రాయ పడుచున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన రైతుల ఇబ్బందులను,వారు పడ్డకష్టాలుఅంతాఇంతా కాదు,పంటలు పండక, రైతు పండించిన దాన్యంకు మార్కేట్‌లో గిట్టుబాటు ధరలేక బ్రతుకు బారంఅయ్యి ,మరణంతప్పా దారి లేదనుకున్న రైతుల ఆత్మహత్యలను నివారించడం కోసం కేసీఆర్‌ ‌ప్రభుత్వం రైతుల అభివృద్దికి పెద్దపీట వేసింది. రైతుకు ఋణమాఫీ, రైతుబందు పథకం ద్వారా పెట్టబడికోసం ఏకరాకు రెండు విడుతలు గా 10వేల రూపాయలు అంద జేస్తూ,రైతుల మీద ఉన్న మమకారంతోపంటనష్టంతో మరణించిన అన్నదాతకు అండగా, వారి కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు,కుటుంబ యాజమాని ఏదైన కారణంచేత కాలంచెల్లితే కుటుంబం బజారున పడోద్దు అనే బలమైన కారణంతో రైతు బీమా పథకం 15 ఆగస్టు, 2018 స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రవేశపెట్టి భీమా బాండ్‌లను రైతుకు ఇవ్వడంతో ప్రారంబించి, అన్ని విధముల రైతుకు నిజమైన స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన ప్రధాత , రైతు బందువు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావును తెలంగాణలో ఉన్న ప్రతిరైతు గుండేల్లో ఎల్లప్పుడు పదిలమే అనేది నిర్వివాదం, రైతు ఆత్మ బందువు అందుకే ఆలోచనలు సాకారం అయ్యింది.

రైతు భీమాతో అన్నదాతలకు మేలు జరిగిందని చెప్పాలి, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకం ధనిక,పేద అనే తేడా లేకూండా వ్యవసాయ భూమి కల్గి ఉండి తెలగాణ ప్రభుత్వం ఇచ్చిన పాస్‌ ‌పుస్తకం ఉన్న రైతు,తెలంగాణ ప్రభుత్వం ,లైఫ్‌ ఇన్సురేన్స్ ఆఫ్‌ ఇం‌డియాతో యంవోయు (మెమోరాండమ్‌ ఆఫ్‌ అం‌డర్‌స్టాండింగ్‌) ‌కుదుర్చుకున్నందున ఎల్‌ఐసి, నియమ నిబందనల ప్రకారం, ప్రతిరైతు భీమా కోసం ప్రత్యేకంగా ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రైతు 14, ఆగస్టు1959 నుండి15,ఆగస్టు 2000 మద్య జన్మించిన వారు మాత్రమే ధరఖాస్తు చేసుకోవాలని, ఆధార్‌ ‌కార్డు మీద ఉన్న పుట్టిన తేదీనే ప్రమాణికంగా తీసుకునీ, దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ ఈ స్కీమ్‌కు అర్హులుగా వ్మవసాయ శాఖ దృవీకరించడం జరుగుతుంది,18 సంవత్సారాల నుండి 59 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి రైతుకు ప్రభుత్వం ప్రిమీయం 2500 రూపాయలు చెల్లించి, అన్నదాతాల పాలిటదేవుడుగా నిలిచిన కేసీఆర్‌ ‌గత సంవత్సరం అకాలమరణం పోందిన వేలాది కుటుంబాలకు నామినికి 10రోజులలోనే 5లక్షల భీమా పరిహరం అందించి, లబ్ది చేకూర్చిందని, రైతు భీమాస్కీంతో కుటుంబాలకు అండాగా నిలిచిన మహనేతను రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరు, వదులుకోరు అనేది సత్యం.

తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగంలో సన్న, చిన్న కారు రైతులే ఉన్నారు. వ్యవసాయమే జీవనాధారంతో బ్రతుకుచున్న రైతులు ఏ కారణంతోనైన మరణించితే ఆ కుటుంబాలు అనాధలు కాకూడదు అని,ఇటువంటి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకొనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు భీమా కోసం ఎల్‌ఐసీకి మొత్తం 2018లో ప్రారంబించి రెండు సంవత్సరాల కోసం మొత్తం1775.95 కోట్ల ప్రీమియం 30.72,901 మంది రైతులకు చెల్లించి, 2019 నుండి 2020 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్తంగా 16856 మంది రైతులకు పరిహరం ఇచ్చి 2020-21 కోసం 1173.54 కోట్లు చెల్లించి, 2020-21 ఆర్థిక సంవత్సరంలో కూడా 31జూలై 2020 వరకు 5913 మంది రైతులకు పరిహరం చెల్లించి, అన్నదాతకు భరోసానింపి, కుటుంబాలకు ఆత్మీయ బందువుగా,తనకోసంచేసే పని,తనతోనే అంతరించిపోతుంది,పరులకోసం చేసేపని వారి హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతుంది అని నమ్మిన వ్యక్తి కేసీఆర్‌, ‌రైతు భీమా అమలుకోసం, పడ్డా కష్టాలు, తీసుకుంటున్న చర్యలు అమోగం, అనిర్వచనీయం.

రైతు భీమా స్కీం ద్వారా మరణించిన కుటుంబాలకు ఎల్‌ఐసీ పరిహరం ఇవ్వడం అనేది దేశ చరిత్రలోనే సరికోత్త రికార్డుగా చెప్పవచ్చు, రైతులకోసం భీమా చేయాడానికీ ఏ సంస్థ ముందుకు రాలేదు, కేసీఆర్‌ ‌తీసుకున్న చారిత్రాత్మకమైన నిర్ణయం రైతుభీమా దేశంలోచరిత్ర సృష్టించి, భీమా సంస్థలకే అమలు చేయడం అనేది ఒక సవాలుగా నిలిచింది.కారణంకూడా ఉంది,గతంలో చాల భీమా కంపెనీలు గ్రూపు ఇన్సూరెన్సులు చేసిన విషయంవిదితమే, కాని ఆయా సంస్థలు ఇచ్చిన ఇన్సూరెన్సులు వేలల్లో ఉండేది, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతుభీమా లక్షలల్లో నమోదు చేసుకోవడం ,గతంలో భీమా సంస్థలు ఇచ్చిన ఇన్సూరెన్సు తక్కువ ప్రిమీయం తీసుకోని, ప్రమాద వశాత్తు మరణం పోందిన వాండ్లకు మాత్రమే పరిహరం ఇవ్వడం జరిగింది.తెలంగాణ ప్రభుత్వం రైతులకోసం,రైతు కుటుంబాల కోసం, ఆసరగా ఎంత వ్యయం అయిన భరించి రైతు కుటుంబాల సంక్షేమం కోసం,వారికీ ప్రత్యక్షంగా ప్రయోజనం కల్గించాలని బావించి, మరణం ఏదైనా భీమా వర్తించే విదంగా, ప్రభుత్వానికీ ఆర్థిక బారం అయినప్పటికీ, లైఫ్‌ ఇన్సూరెన్సు ఆఫ్‌ ఇం‌డియాతో సయోద్యతో ఒప్పించి, సంచాలనాత్మక నిర్ణయం తీసుకోని ప్రతిరైతుకు బందువు అయిన కేసీఆర్‌కు అడుగడుగునా బ్రహ్మరధం పట్టుచుండటం, అనిర్వచనీయం.ప్రజల జేజేలు అభినందనీయం.

dr sangani
డా. సంగని మల్లేశ్వర్‌,
‌జర్నలిజం విభాగాధిపతి,
కాకతీయ విశ్వవిద్యాలయం,వరంగల్‌,
‌సెల్‌•9866255355

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!