Take a fresh look at your lifestyle.

కలెక్టరేట్‌ ఎదుట రైతుల ధర్నా

మూసీ వాగులో స్మశాన వాటిక నిర్మాణం సరికాదు

సూర్యాపేట, జూలై 7, ప్రజాతంత్ర ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పకడ్బందీగా గ్రామాల్లో నిర్మిస్తున్న స్మశాన వాటికలు, డంపింగ్‌ ‌యార్డు పనులకు అభాసుపాలు అయ్యే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని నిరసిస్తూ నాగారం మండలం పేరబోయిన గూడెం గ్రామ రైతులు మంగళవారం జిల్లా కలెక్టరేట్‌ ‌కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు విలేకరులతో మాట్లాడుతు స్మశాన వాటిక నిర్మాణానికి ప్రభుత్వం రూ.12లక్షలు కేటాయిస్తే స్థానిక తహశీల్దార్‌ ‌ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ప్రవహించే మూసీ వాగులో స్మశాన వాటిక, డంపింగ్‌ ‌యార్డ్‌ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం సరికాదన్నారు.

పేరబోయిన గూడెం గ్రామంలో ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ స్మశాన వాటికను ప్రజలకు అమోదయోగ్యంకాని మూసీ వాగులో నిర్మించడం, ప్రభుత్వం విడుదల చేసిన నిధులను నీళ్లపాలు చేయడమే అని విమర్శించారు. మూసీవాగులో నిర్మించే స్మశాన వాటిక రోడ్డు కోసం పట్టాదార్‌ ‌రైతుల భూముల నుండి బలవంతంగా భూమి సేకరణ పాల్పడుతున్న తహశీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ఇటీవల స్థానిక తహశీల్దార్‌ ‌సర్వేనెంబర్‌ 923, 971‌లో 56 ఎకరాల ప్రభుత్వ భూములను అనర్హులకు అక్రమంగా పట్టాలు చేసి అక్రమా ర్జనకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇసుక రవాణకు సైతం అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్పడుతున్నారని తెలిపారు. అనంతరం పరిపాలన అధికారి శ్రీదేవికి వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో రైతులు పెరబోయిన నాగరాజు, నరేష్‌, ‌సుధాకర్‌, ఉప్పలయ్య, వీరయ్య, వేణు, పుల్లమ్మ, పుష్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

error: Content is protected !!