Take a fresh look at your lifestyle.

వాణిజ్య పంటలతోనే రైతన్నలకు లాభం

  • ఫామాయిల్‌ ‌సాగు దిశగా రైతులు నడవాలి
  •  జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

రాష్ట్ర ప్రభుత్వం రైతులను అర్థికంగా స్థితిమంతులను చేసేందుకే నియంత్రిత పంటల సాగువైపు మళ్ళిస్తోంద ని ప్రధానంగా వాణిజ్య పంటలలో డిమాండెడ్‌ ‌పంటల ను సాగుచేస్తేనే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ ‌సంజయ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం జగిత్యాల మండలం లక్ష్మిపూర్‌ ‌గ్రామంలో ఉపాధిహామి పథకంలో బాగంగా 22 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసిరోడ్డు, డ్రైన్‌ ‌నిర్మాణానికి జడ్పిచైర్మన్‌ ‌దావవసంతతో కలిసి భూమిపూజ చేశారు. ఆనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ )క్ష్మిపూర్‌  అభ్యుదయ  గ్రామమని ఇక్కడి రైతులు పొందిన చైతన్యంతో ఇతరులకు ఆధర్శప్రాయలన్నారు. ఇక్కడి చెరువులో గత పాలకులు పూడిక తీయకపోవడంతో రైతులకు ప్రయోజనం చేకూరలేదని, సిఎం కేసిఆర్‌ ‌చేపట్టిన చెరువుల పూడికతీత పనులలో 46 )క్షల వ్యయంతో ఇక్కడి చెరువు పూడిక తీయడంతో ఎండాకాలంలోను జళకళను సంతరించుకొందన్నారు. ఆతదుపరి ఈ చెరువు వినియోగంలోకి వచ్చి రైతులకు, మత్సకార్మికులకు లాభం చేకూరుతోందన్నారు. అలాగే మాజి ఎంపి కవిత ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలలో బాగంగా వివిధ కుల సంఘాల భవనాల నిర్మాణాలు జరిగాయన్నారు. )క్ష్మిపూర్‌ ‌గ్రామస్తుల కోసం ప్రభుత్వం ఎన్ని నిధులనైనా కేటాయించేందుకు సిద్దంగా ఉందని 15 లక్షల వ్యయంతో సిసి రోడ్లు, మురికి కాలువను నిర్మించుకొంటున్నామన్నారు.

ఇటివలే వచ్చిన మంత్రి దయాకర్‌రావును మరిన్ని నిధులను జిల్లాకు ఇవ్వాలని సోదరి దావ వసంతతో కలిసి మంత్రిని అడిగామని అందుకు మంత్రి ఐదు కోట్ల పనులకు తక్షణమే అనుమతులను ఇచ్చారన్నారు. ఇందులో ప్రతి గ్రామానికి సగటున 10 నుంచి 15 లక్షల వరకు నిధులు వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో ఇక్కడ ప్రాతినిద్యం వహించిన వ్యక్తులు కేవలం పత్రికా ప్రకటనల వరకే పరిమితమయ్యారని అభివృద్ది పనుల కు నిధులను తెచ్చిన దాఖలాలులేవన్నారు. లక్ష్మిపూర్‌ ‌గ్రామానికి ఇచ్చిన హామీల్లో కేవలం సిడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌యూనిట్‌ ఓక్కడే పెండింగ్‌లో ఉంటోందని ఇదికూడా టెండరు దారులతోనే సమస్య ఉత్పన్నమవుతోం దన్నారు. రాష్ట్రంలో సిడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌యూనిట్లు ప్రారంభమైతే లక్ష్మిపూర్‌లో కూడా ఏర్పాటవుతుందని వ్యవసాయశాఖ మంత్రి హామీ ఇచ్చారని ఈసందర్బం గా ఎమ్మెల్యే చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంకు నష్టం వస్తున్నా రైతులు పండించిన దొడ్డు బియ్యాన్ని కొనుగో లు చేస్తోందని దీంతో ప్రభుత్వానికి 4 వేల కోట్ల నష్టం వస్తోందన్నారు. వాస్తవానికి దేశంలో అన్నిరకాల పంటలు పండుతున్నాయని కేవలం నూనె గింజలను సాగుచేసేవారు లేక విధేశాల్లోనుంచి ప్రతి ఏటా 70 వేల కోట్ల నూనె గింజలను దిగుమతి చేసుకొంటున్నామన్నారు. దొడ్డు బియ్యంతో రైతుకు, ప్రభుత్వానికి ఎలాంటి లాభంలేదని ఫామాయిల్‌ ‌పంట సాగువైపు రైతులు దృష్టిసారించాలని ప్రభుత్వం ఆన్నివిధాల సహకారాన్ని అందిస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. ఈకార్యక్రమములో ఎంపిపి గంగారాంగౌడ్‌, ‌వైస్‌ ఎం‌పిపి పాలెపు రాజు, సర్పంచ్‌ ‌జాన్‌, ‌మార్కెట్‌ ‌కమిటి చైర్మన్‌ ‌దామోదర్‌రావుతోపాటు టిఆర్‌ఎస్‌ ‌నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు ఉన్నారు.

Leave a Reply