“దేశానికి అన్నం పెట్టే రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆయుధాలతో దాడిచేయటమా? వారి పై ప్రభుత్వం వాటర్ ఫిరంగులతో,టీయర్ గ్యాస్‌తో ప్రతాపమం చూపడమా?ఎద్దు ఏడ్చిన కాడి,రైతు ఏడ్చిన దేశం బాగుపడదంటారు.వారు ఆడిగిందేమిటి? ఇప్పటికే మధ్య దళారుల దోపిడీకి గురి అవుతున్న మమ్మల్ని భకాసురులకు బలి చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు? అర కొర ప్రభుత్వ కొనుగోళ్ల వల్ల అటు బతకాలేక,ఇటు చావా లేక జీవితాలను వెళ్లదీస్తున్న రైతును బడా కార్పొరేట్ శక్తులకు బలి చేస్తారా అని అడుగుతున్నారు?
వారి కడుపున పుట్టిన బిడ్డలు వారిలాగే వ్యవసాయం చేయాలా?చేస్తే మాత్రం ఏముంది వారిలాగే రోడ్డున పడాల్సిందేగా.జై కిసాన్ అంటిరి రైతుకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే జైల్లో వేస్తుంటిరి.ఇదేమి న్యాయం ?ఇదిమి ప్రజాస్వామ్యం? మేము ఏ కాకుళం కాము.కాకి బలగమంతా బలగం ఉంది.కావ్ కావ్ మంటూ కాదలినమట్టున్నారు. జంతర్ మంతర్ జెర బయలు దేరినం అంటున్నారు.”
వాళ్లేమీ దేశద్రోహులు కాదు, ప్రభుత్వాన్ని కూల్చే కుట్రదారులు కాదు, టెర్ర రిస్టులు ,సంఘ విద్రోహక శక్తులు అంతకంటే కాదు, వాళ్ళు కేవలం మట్టిని నమ్ముకున్న రైతు లు.ఆరుగాలం కష్టపడి మట్టి నుంచి బంగారం తీసే రైతన్నలు. దేశానికి అన్నం పెట్టే రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆయుధాలతో దాడిచేయటమా? వారి పై ప్రభుత్వం వాటర్ ఫిరంగులతో,టీయర్ గ్యాస్‌తో ప్రతాపమం చూపడమా?ఎద్దు ఏడ్చిన కాడి,రైతు ఏడ్చిన దేశం బాగుపడదంటారు.వారు ఆడిగిందేమిటి? ఇప్పటికే మధ్య దళారుల దోపిడీకి గురి అవుతున్న మమ్మల్ని భకాసురులకు బలి చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు? అర కొర ప్రభుత్వ కొనుగోళ్ల వల్ల అటు బతకాలేక,ఇటు చావా లేక జీవితాలను వెళ్లదీస్తున్న రైతును బడా కార్పొరేట్ శక్తులకు బలి చేస్తారా అని అడుగుతున్నారు? శాంతియుతంగా నిరసన తెలుపుతామని ఎంత చెప్పుతున్న టీయర్ గ్యాస్ ఎందుకు ఉపయోగిస్తున్నట్లు?ఒక ప్రక్క చర్చలు అంటూనే సనాయ్యి నొక్కులు ఎందుకు నొక్కుతునట్లు?ఎక్కడో ఖండాలకు ఆవల ఉన్న కెనడా ప్రధాని స్పందిస్తారే, కానీ మా పోరాటస్థలనికి పదంటే పది ఆమడల దూరం లేని మన దేశ ప్రధాని ఎందుకు స్పందించరు ?ఈ సమస్య మనదేశ అంతర్గత సమస్యయే అయ్యియుండొచ్చు,బయటి వారి జోక్యం అనవసరమనేది వాస్తవం కావొచ్చు,కానీ పోరాటంలో న్యాయం ఉందిగా.
దేశంలో 85% సన్న చిన్నకారు రైతులే ఉన్నప్పుడు ఫార్మింగ్ ప్రోడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ఆక్ట్ ఎవరి ప్రయోజనాల కోసమని ప్రశ్నిస్తున్నారు? ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న రైతులను సాధికారత మరియు రక్షణ ఒప్పందాల ద్వారా బడా కార్పొరేట్లకు కట్టుబానిసలుగా చేయనున్నారా అని ప్రశ్నిస్తున్నారు? ఎసెన్షియల్ కమోడిటీవ్ ఆక్ట్ ద్వారా ప్రభుత్వ నియంత్రణ తొలగించి మధ్య దళారులకు దోచి పెట్టడాన్ని ప్రశ్నిస్తున్నారు? కేవలం మూడు పూటలా తిండి కోసం వ్యవసాయం చేస్తున్న రైతుల నోటికాడి ముద్దను లాగేసి కార్పొరేట్ల కనికరానికి మా బతుకులు తాకట్లు పెడతారా అని ప్రశ్నిస్తున్నారు? విద్య,వైద్యం, రోడ్లు,రైవెళ్ళు విమానయానా, టెలిఫోన్,టెలివిజన్ లాంటివి ప్రైవేటుపరం చేసి అంబానీ,ఆదానిలకు దోచిపెట్టింది చాలదా అన్నట్లు మీ కన్ను బుక్కెడు బువ్వ పెట్టె మా పేద రైతుల పై పడ్డదా అని ప్రశ్నిస్తున్నారు. కరోనా కాలంలో దేశ ప్రజలందరూ దివాలతిస్తే అంబానీ,ఆదానీల ఆస్తులెట్ల పెరిగాయి?దానికి కారకులు మీరు కాదా?కార్మిక చట్టాలు మార్చి కట్టుబానిసలు చేస్తున్నారు.ప్రత్యేక సెజ్జులా పేర వారి భూములు లాకొన్ని కార్పెట్లుపరచి కార్పొరేట్లకు పంచుతున్నారు.సెస్సుల పేర రాజమార్గంలో దోపిడిచేస్తున్నారు.
అది సరిపోదనట్లు వారు పొట్టనిపుకునే ఈ వ్యవసాయం పై మీరు కండ్లు పెడితిరి.ప్రభుత్వ ఉద్యోగాలే నిపొద్దని జీవోలిస్తీరి,వారి కడుపున పుట్టిన బిడ్డలు వారిలాగే వ్యవసాయం చేయాలా?చేస్తే మాత్రం ఏముంది వారిలాగే రోడ్డున పడాల్సిందేగా.జై కిసాన్ అంటిరి రైతుకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే జైల్లో వేస్తుంటిరి.ఇదేమి న్యాయం ?ఇదిమి ప్రజాస్వామ్యం? మేము ఏ కాకుళం కాము.కాకి బలగమంతా బలగం ఉంది.కావ్ కావ్ మంటూ కాదలినమట్టున్నారు. జంతర్ మంతర్ జెర బయలు దేరినం అంటున్నారు.ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ రైతులేకాదు, హర్యానా,ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్,హిమాచాల్ ప్రదేశ్,మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్యాల నుంచి అత్యవసర వస్తువులు, కంభళ్ళు,సబ్బులు,టూత్ బ్రేస్సులు,పప్పుదినుసులు,రొట్టెలు కట్టుకొని అంతిమ సమరానికి వచ్చామంటున్నారు. నీ చుట్టాలకు మేలుజేయ తెచ్చిన చట్టాలను రద్దు చేసే వరకు రణ రంగాన్ని వీడమంటున్నారు.మా బతుకులు పోరాటం లో బలిశాలైఎదురు తిరుగుతాం,కార్పొరేట్లకు దోచి పెట్టుటకు తెచ్చిన చట్టాలకు అగ్గిపెట్టె వరకు మా పోరాటం ఆగదంటున్నారు.ఆరు నెలల తిండిగింజలతో వచ్చినం.అటో ఇటో తేల్చుకునే వరకు మా కిసాన్ ఉద్యమం ఆగదంటున్నారు.కార్పొరేట్లకు చుట్టమైన ప్రభుత్వమా నీవు దిగిరాక తప్పదు.మా పోరాటానికి మీ మిత్రపక్షం జె జె పి మద్దతు తెలుపుతుంది,ఎన్ డి ఎ మిత్రపక్షం ఆర్ ల్ సి గొంతు కలుపుతుంది.స్వతంత్ర ఎమ్మెల్యే లు సంఘీభావం ప్రకటిస్తున్నారు.
మాజి క్రీడాకారులు మద్దతిస్తున్నారు.ఢిల్లీ-హర్యానా,ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దులో నిరసనలు హోరెత్తుతున్నాయి.5గురు సభ్యులతో కమీటీ అంటున్నారు.కమిటీలు ఏ సమస్యను పరిష్కరించాయో చరిత్ర ఇప్పటికే మనముందు ఎన్నో సాక్షలుంచింది..కమీటీ అంటేనే కాలయాపన.35 రైతు సంఘాలుండగా 7గురు సభ్యులంటున్నారు,మా ఐక్యతను చీల్చుటకు అది మీ పాచికని మాకు తెలియదా? ఐక్యంగానే ఉంటాం అందరంకలిసే చర్చలు జరుపుతామని అంటుండ్రు.మూడు చట్టాలు ఉపసంహరిం చేవరకు, విద్యుత్ బిల్లు ఉపసంహరిం చేవారకు,కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించేవారకు ఈ పోరాటం ఆగదు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వమే తేల్చుకోవాలి. రైతులవైపా, కార్పొరేట్ల వైపా. జై కిసాన్ జై జై కిసాన్.

టి టి యు జిల్లా అధ్యక్షులు
మహబూబ్‌నగర్, 9494019270