భూ ప్రక్షాళనకు పాత రెవిన్యూ చట్టాన్ని రద్దు చేసి,భూమి హక్కుదార్లకు,రైతాంగానికి మేలు జరిగే విధంగా రూపొందించనున్న కొత్త రెవిన్యూ చట్టాన్ని రైతాంగం మొత్తం స్వాగతిస్తోందని,ఇటువంటి నిర్ణయం తీసుకున్న రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్కు రైతాంగం రుణపడి ఉంటుందని టిఆర్ఎస్ మండల అధ్యక్షులు అన్నెం సత్యనారాయణ మూర్తి తెలిపారు.బుధవారం తూరుబాక గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ’’దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రైతులకు పెట్టుబడి తోపాటు,బీమా కల్పించి రైతు బాంధవుడయ్యాడన్నారు.
భూ ప్రక్షాళన,డిజిటల్ పాస్ పుస్తకాల పంపిణీలో రెవిన్యూ అధికారుల అవినీతిని క్షుణ్ణంగా పరిశీలించిన ముఖ్యమంత్రి రెవిన్యూ చట్టంలో సమూల మార్పులు చేయటం పట్ల రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోందన్నారు.ఈ సమావేశంలో ఆయనతోపాటు టిఆర్ఎస్ అధికార ప్రతినిధి యండి జానీపాషా, రైతు బంధు అధ్యక్షుడు బత్తుల.శోభన్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ పూజారి సూర్యచంద్రరావు,బొల్లి.వెంకటయ్య ,సర్పంచులు వరసా.శివరామకృష్ణ(నర్సాపురం),భూ