(నేడు జాతీయ రైతు దినోత్సవం)
హలం తోనే దేశ ప్రగతి సాధ్యమని చెప్పిన చరణ్ సింగ్ దేశానికి ప్రధాని మాత్రమే కాదు నిరంతరం రైతు సంక్షేమం కోసం అహరహం శ్రమిం చిన వ్యక్తి. ప్రధానినన్న అధికారం భావం ఏమాత్రం లేకుండా జీవితాంతం రైతు ప్రయోజనాలే ధ్యేయంగా కృషిచేసి గుర్తింపు పొందిన నిగర్విగా కీర్తి గడించారు. చరిత్రకారులు, ప్రజలు ఆయనను ‘భారతదేశ రైతు విజేత’ గా ప్రశంసించారు. చరణ్ సింగ్ 1902 డిసెంబర్ 23న ఉత్తర ప్రదేశ్, మీరట్ జిల్లా నూర్పూర్ లోని జాట్ కుటుంబంలో జన్మించారు. మహాత్మా గాంధీ నేతృత్వంలో లో స్వాతంత్య్రోద్యమంలో భాగస్వామి అయ్యారు. గజియాబాద్ జిల్లా ఆర్య సమాజ్, మీరట్ జిల్లా భారత జాతీయ కాంగ్రెస్ లో 1931 నుండి క్రియాశీలకపాత్ర పోషించారు. రెండు సార్లు జైలుకు వెళ్ళారు.
1937లో యునైటెడ్ ప్రొవిన్సెస్ శాసనసభలో సభ్యునిగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించే చట్టాలపై ఎక్కువ ఆసక్తి కనబర్చేవారు. భూస్వామ దోపిడీని నిరసిస్తూ సైద్ధాంతిక, ఆచరణాత్మక విధానం అవలంబించారు. దేశానికి 5వ ప్రధానమంత్రిగా 1979 జూలై 28 నుండి 1980 జనవరి 14 వరకు సేవలనందించా.
1962 – 1967 కాలంలో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలలో ముగ్గురు ప్రధాన నాయకులలో ఒకరు. 1950 దశకంలో అప్పటి యుపి ముఖ్యమంత్రి పండిట్ గోవింద్ వల్లబ్ పంత్ నేతృత్వంలో విప్లవాత్మక భూ సంస్కరణల చట్టాల రూపకల్పనలో చరణ్ సింగ్ గుర్తింపు పొందారు. పార్లమెంటరీ సెక్రటరీ గా, రెవెన్యూ మంత్రిగా అతను బాధ్యతలు నిర్వర్తించారు. 1959లో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రవటించిన సామ్యవాద, సముదాయవాద భూ విధానాలను నాగపూర్ కాంగ్రెస్ సెషన్లో వ్యతిరేకించి అందరి దృష్టిని ఆకర్షించారు. తరువాత చరణ్ సింగ్ 1967 ఏప్రిల్ 1 న కాంగ్రెస్ నుండి వైదొలగి, ప్రతిపక్షంలో చేరారు. ఉత్తర ప్రదేశ్ లో మొదటి కాంగ్రెసేతతర ముఖ్యమంత్రి అయ్యారు. .
జనతా కూటమిలో ప్రధాన భాగమైన భారతీయ లోక్‌దళ్ పార్టీ నాయకునిగా 1977 లో ప్రధాని రేసులో నిలిచారు కానీ ఆశయం నెరవేరక నిరాశపరిచారు.1974 నుండి ఒంటరి పోరాటమే ఆయనది.. రాజ్ నారాయణ్ కృషి ఫలితంగా చరణ్ సింగ్ 1979 లో ప్రధాని అయ్యారు. 1979 జూలై 28 నుండి 1980 జనవరి 14 వరకు చరణ్ సింగ్ భారతదేశ 5వ ప్రధానమంత్రిగా కొనసాగారు.
అంతకు ముందు ఉప ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు. చరణ్ సింగ్ ప్రధాని కాలంలో లోక్‌సభ సమావేశమే జరగలేదు. లోక్ సభ సమావేశం ముందురోజు ప్రభుత్వానికి కాంగ్రెసు పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో భారతీయ లోక్‌దళ్ ప్రభుత్వం కూలిపోయింది. చరణ్ సింగ్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం లోక్‌సభకు జరిగిన ఎన్నికల నుంచి 1987 మే 29లో లో మరణించే వరకు లోక్‌దళ్ పార్టీ నాయకునిగా ప్రతిపక్షంలో ఉన్నారు.
ఆయన కుమారుడు అజిత్ సింగ్ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీఅధ్యక్షులు. అజిత్ సింగ్ కేంద్రమంత్రిగా, అనేక సార్లు పార్లమెంటు సభ్యునిగా సేవలందించారు . దిల్లీ లలోని చరణ్ సింగ్ సమాధి కిసాన్ ఘాట్ అని వ్యవహరిస్తారు. జన్మదినం డిసెంబరు 23 న కిసాన్ దివస్ (జాతీయ రైతు దినోత్సవం) గాజరుపుతారు. భారత ప్రభుత్వం ఆయన గౌరవార్ధం తపాలా బిళ్ల విడుదలచేసింది. లక్నో లోని విమానాశ్రయానికి ‘‘చౌధురి చరణ్ సింగ్ అంతర్జాతియ విమానాశ్రయం’’ అని పరుపెట్టారు. . మీరట్ విశ్వ విద్యాలయానికి ‘‘చౌధురి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం’’, ఎటావా జిల్లాలోని కళాశాలకు ‘‘చౌధురి చరణ్ సింగ్ పోస్టు గ్రాడ్యుయేట్ కళాశాల’’గా . బులంద్‌షహర్ జిల్లాలో ఆసుపత్రికి ఆయన పేరు పెట్టారు.
