Take a fresh look at your lifestyle.

వ్యవసాయాన్ని బలోపేతం చేసేందుకు రైతు వేదికలు

గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాన్ని బలోపేతం చేసేందుకు రైతు వేదిక నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు తెలిపారు .సోమవారం రూరల్‌ ‌జిల్లాలోని నడికుడ మండలంలో గల వరికోలు గ్రామంలో ప్రత్యేక పారిశుద్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు సాగు విధానాలపై చర్చించుకునేనందుకు, సాంకేతిక సలహాలు తీసుకునేందుకు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు తెలుసుకునేందుకు ఈ వేదికలు ఉపయోగపడతాయన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 71 రైతు వేదికల నిర్మాణం కొరకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఎవరి హయాం లో అభివృ ద్ధి జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయాలని, గత ప్రభుత్వంలో కాల్వ నీళ్ల కోసం గోస పడ్డాం కానీ కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతి చెరువు నీళ్లతో కళకళలాడుతోందన్నారు. గతంలో రైతు కుటుంబాలకు పెళ్లి సంబంధం దొరకక పోయే దని, భవిష్యత్‌లో రైతును రాజు చేసి రైతు బాగుండాలి అని ఆలోచన చేసిన ఏకైక ముఖ్య మంత్రి కెసిఆర్‌ అని అన్నారు. గతం లో విద్యుత్‌, ‌నీళ్ళ కోసం ధర్నాలు జరిగేవి కానీ నేడు24 గంటల కరెంట్‌, ‌ప్రతి ఎకరాకు సాగు నీరు అందు తుందన్నారు.

కష్ట కాలం లో కూడా రూ.30 వేల కోట్లు పెట్టి ధాన్యం, మక్కా లను కొన్నామని, పత్తి పంట ఎంత పండించిన ప్రభు త్వం కొట్టుంది. దొడ్డు బియ్యం కంటే తెలంగాణ సోనాకి మంచి డిమాండ్‌, ‌రేట్‌ ఉం‌దన్నారు. ప్రతి ఇంటి పరిసరాలను పరి శుభ్రంగా ఉం చుకోవాలన్నారు. ప్రతీ నియోజకవర్గంలో 25000 వేల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం నిలువ ఉండేలా గోదాం నిర్మాణము చేపట్టానున్నా మన్నారు. 30వేల కోట్లు కరువు పనిని పెంచి వారానికి ఒకసారి డబ్బులు ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్‌ ‌శాఖ ప్రిన్సిపాల్‌ ‌సెక్రటరీ సందీప్‌ ‌కుమార్‌ ‌సుల్తానీయ పార్లమెంటు సభ్యులు పసునూరి దయాకర్‌, ‌శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ ‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఎం.‌హరిత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply