Take a fresh look at your lifestyle.

రైతు రుణ మాఫీ కోసం రూ.1200కోట్లు విడుదల

  • కాంగ్రెస్‌,‌బిజెపిలు విమర్శలు మానాలి
  • తెలంగాణలో రైతులకు ఆదుకుంటున్న ఘనత కెసిఆర్‌దే
  • మంత్రి హరీష్‌రావు వెల్లడి

రైతుల కోసం పనిచేస్తున్న సీఎం కేసీఆర్‌ ‌ద ఇష్టారీతిన విమర్శలు చేస్తే సహించేది లేదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతుల కోసం పోరాడుతున్నామంటూ కాంగ్రెస్‌ , ‌బీజేపీలు మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. లాక్‌డౌన్‌ ‌కష్టకాలంలోనూ ఊరూరా ధాన్యం కొనుగోళ్లు ఏర్పాటుచేసిన ఘనత టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానిదన్నారు. కేంద్రాన్ని ఉపాధి హా పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయమని ఎన్ని సార్లు కోరినా పట్టించు కోలేదన్నారు. కాంగ్రెస్‌, ‌బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుల కోసం రు ఏం చేశారని హరీశ్‌రావు సూటిగా ప్రశ్నించారు. డియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్‌, ‌బీజేపీలపై నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రుణ మాఫీ కోసం రూ. 1200 కోట్లు విడుదల
చేసిందన్నారు. రైతులకు 25 వేల రూపాయల రుణాలను ఒకే సారి మాఫీ చేయనున్నాం.ఇందు కోసం ఆర్థిక శాఖ1200 కోట్లు విడుదల చేసింది.వ్యవసాయ శాఖ ఈ మొత్తాన్ని దాదపు 5 లక్షల 85 వేలమంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, ఈ విషయంలో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌, ‌బీజేపీ నాయకులకు రైతుల విషయంలో తమను విమర్శించే నైతిక హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు.

ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ రైతాంగానికి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వారికి రుణమాఫీ చేసిందన్నారు. మొదటి దఫా కింద రూ.25 వేల లోపు రుణాలన్న వారికి ఒకేసారి మాఫీ చేస్తామని బ్జడెట్‌ ‌సమావేశాల్లోనే స్పష్టం చేశామన్నారు. కాంగ్రెస్‌, ‌బీజేపీ పాలిత రాష్టాల్లో్ర రైతులను ఏం ఉద్ధరించారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించే ముందు తమ లోపాలను చూసుకోవాలన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌, ‌బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో మాత్రమే టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రైతులు పండించిన పంటలన్నీ కొనుగోలు చేసి వారిని ఆదుకుంటోందన్నారు. రాష్ట్రంలో వరితోపాటు మొక్కజొన్న, జొన్న, కంది, వేరుశనగ, పొద్దు తిరుగుడు వంటి అన్ని రకాల పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేసింది ఒక్క టీఆర్‌ ఎస్‌ ‌ప్రభుత్వమేనన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా రైతుల కోసం ఇంతగా నిధులు ఖర్చు చేసింది లేదన్నారు. రైతుబంధు ద్వారా ఎకరాకు రూ. 5 వేల చొప్పున ఏడాదికి పదివేలు అందజేస్తున్నామన్నారు. ఈ పథకం కింద రైతుల సంక్షేమం కోసం రూ.12 వేల కోట్ల నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. దేశంలో ఎక్కడలేని విధంగా రైతులు అకాల మరణం చెందిన సందర్భంలో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు రైతుబీమా ద్వారా రూ.5 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. అనవసర విమర్శలు చేస్తే ప్రజల్లో రే నవ్వుల పాలవుతారని అన్నారు.

Leave a Reply