Take a fresh look at your lifestyle.

10 ‌నాటికి రైతు వేదికలు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్‌ ‌షేక్‌ ‌యాస్మిన్‌ ‌బాష

వనపర్తి, సెప్టెంబర్‌, 22(‌ప్రజాతంత్ర విలేకరి) : ఆశిం చిన స్థాయిలో జిల్లా లో రైతు వేదికల పనులు జరుగు తున్నాయని జిల్లా కలెక్టర్‌ ‌షేక్‌ ‌యాస్మిన్‌ ‌బాష అన్నారు. మంగళవారం ఆమె పాన్‌గల్‌ ‌మండలం కేతేపల్లి పాన్‌గల్‌ ‌తెల్లరాళ్లపల్లిలో రైతు వేదికలు పల్లె ప్రకృతి వనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె కేతేపల్లిలో మాట్లాడుతు జిల్లాలో 71 రైతువేదికలు నిర్మిస్తుండగా పంచాయితీరాజ్‌ ఇం‌జనీరింగ్‌ ‌శాఖ ద్వారా ఉపాధి హామీ పథకం కింద అలాగే వ్యవసాయశాఖ పర్యవేక్షణలో వీటిని నిర్మించడం జరుగుతుందన్నారు. అక్టోబర్‌ 10 ‌వరకు అన్ని రైతు వేదికలను పూర్తి చేయాలని ఆదేశించారు.

ఇప్పటివరకు 50శాతం రైతు వేదికలు రూఫ్‌ ‌స్థాయి వరకు పూర్తి చేయడం జరిగిందని ఇటీవల కురిసిన వర్షాల వల్ల పనులు కొద్దిగా మందగించాయని ఇప్పుడు వర్షాలు తగ్గినందున పనులు వేగవంతం చేయాలని ఆమె గ్రామాల సర్పంచులు అధికారుల తో కోరారు. అలాగే జిల్లాలో చేపట్టిన ప్రకృతి వనాలు కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు శ్రీకారం చుట్టడం జరిగిందని ఈ నెల 30 వరకు 255 గ్రామాలలో చెత్త వేరు చేసే షెడ్డులను పూర్తి చైస్తుమని ఆమె తెలిపారు. పలె ప్రకృతి వనాలపై జిల్లా కలెక్టర్‌ ‌మాట్లాడుతు వచ్చే నెల 10 వరకు 255 గ్రామపంచయాతీలు 64 హాబీటేషన్‌ ‌ల్లో పూర్తి చేయాలని సర్పంచుసు ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీలను కోరారు. కార్యక్రమంలో పంచాయతీరేజ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇం‌జనీర్‌, ‌శివకుమార్‌, ‌తాసిల్దార్‌, ‌శ్రీనివాసరావు, వ్యవసాయా ధికారి హైమావతి ప్రజాప్రతినిధులు అధికారులు తదితురుల ఉన్నారు.

Leave a Reply