Take a fresh look at your lifestyle.

హింసను ఖండిస్తున్నాం .. రైతు సంఘాల ప్రతినిధులు

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, న్యూ దిల్లీ: ఢిల్లీలోని మూడు సరిహద్దు ప్రాంతాలు సింగూ, తిక్రీ, ఘాజిపూర్‌లలో క్యాంపింగ్ చేస్తున్న రైతులకు నిర్దిష్ట రిపబ్లిక్ డే పరేడ్ తర్వాత మాత్రమే రాజ్‌పథ్‌లో పరేడ్ చేసుకోవాలి అని పోలీసుల అనుమతి ఉండగా రైతులు నిరసన ర్యాలీ చేపట్టారు ఐతే నిరసనలో గందరగోళం చోటు చేసుకుంది. ఒక రైతు ప్రాణం కోల్పోయారు ర్యాలీ సమయంలో. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలలో – సింగు, ఘాజిపూర్, తిక్రీ, ముకార్బా చౌక్, నంగ్లోయి టెలికాం సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆమేరకు రైతుల ఫోన్లు మూగబోయాయి. భద్రతా సిబ్బందిని ఢిల్లీ సరిహద్దులలో హోం శాఖ పెంచింది. రైతుల నిరసన సందర్భంగా జరిగిన ఘర్షణలపై సంయుక్త కిసాన్ మోర్చా సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ, హింసాత్మక సంఘటనలకు రైతులకి సంబంధం లేదని చెప్పింది. రైతుల ర్యాలీ ముందుగా నిర్ణయించిన మార్గాన్ని అనుసరించింది అని రైతు నాయకుడు బల్బీర్ సింగ్ రాజేవాల్ తెలిపారు. సంయుక్త కిసాన్ మోర్చా నుండి ఎవరూ ఔటర్ టర్ రింగ్ రోడ్‌కు వెళ్ళలేదు. “రైతులపై జరిగిన పోలీస్ హింసను ఖండిస్తున్నాము, శాంతిని కాపాడుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము” అని రాజేవాల్ తెలిపారు.

ఢిల్లీ సరిహద్దుల నుంచి రైతుల ట్రాక్టార్ ర్యాలీ పోలీసు బారికేడ్లను ఉల్లంఘించి, పొలిసు సిబ్బందితో ఘర్షణ పడుతూ, ఐటిఓ ప్రాంతానికి రైతుల నిరసన ర్యాలీ చేరింది. అక్కడ బస్సు ధ్వంసం అయ్యింది. నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల బృందాలు ర్యాలీగా మంగళవారం మధ్యాన్నం ఎర్రకోటలోకి ప్రవేశించింది. ఒక నిరసనకారుడు ఐటిఓ ప్రాంతంలో కాల్చి చంపబడ్డాడు. చనిపోయిన నిరసన కారుడు నడుపుతున్న ట్రాక్టర్ కిందకి మిగతా రైతులు చేరి బులెట్ల నుండి రైతులు తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేసారు. అలాగే ఎర్రకోట వద్ద ఒక పోలీసు కూడా గాయపడ్డాడు.

ఢిల్లీ మూడు సరిహద్దులైన సింగు, తిక్రీ, మరియు ఘాజిపూర్ నుంచి పోలీసులు క్యాంపింగ్ కొనసాగిస్తూ రైతుల గణతంత్ర పరేడ్ నిర్దిష్ట మార్గాల్లో నిర్వహించడానికి అనుమతి ఇచ్చినప్పటికీ, రాజ్‌పథ్‌లో అధికారిక గణతంత్ర దినోత్సవ తరవాత కవాతు చేయాలి అని నిర్ణయం జరిగినప్పటికీ అలా జరగకుండా పోలీసులు ఆడుకోవటంతో దేశరాజధానిలో గందరగోళం చోటు చేసుకుంది. రైతులు పోలీసులు మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, రైతులు సరిహద్దుల ప్రక్కనే ఉన్న ప్రాంతాలలోనే ర్యాలీ చేసుకుంటూ తమ నిరసన తెలపాలి అని మాత్రమే ఉందని సెంట్రల్ ఢిల్లీ వైపు వెళ్ళకూడదు అని నిర్ణయం జరిగింది అని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. మూడు సరిహద్దుల వద్ద ఉన్న బారికేడ్లను ఉల్లంఘించిన రైతుల ర్యాలీని నియంత్రించడానికి పోలీసులు లాఠీ చార్జ్ మరియు టియర్ గ్యాస్ను ప్రయోగించారు.

నేటి ట్రాక్టర్ల ర్యాలీ తరవాత వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన రెండు నెలలు పూర్తి చేస్తుంది. తదుపరి ఆందోళనగా కేంద్ర బడ్జెట్‌ పార్లమెంటులో సమర్పించే రోజున అంటే ఫిబ్రవరి 1న పార్లమెంటుకు కాలినడకన వెళ్లే ప్రణాళికను రైతు సంఘాల నాయకులు ప్రకటించారు.

ఢిల్లీలో రైతుల పోలీసుల మధ్య జరిగే ఘర్షణలపై, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మాట్లాడుతూ “ఢిల్లీ నిర్ఘాంతరపోయే దృశ్యాలు చూసాం. హింస ఆమోదయోగ్యం కాదు. శాంతియుతంగా నిరసన తెలిపే రైతులు సృష్టించిన సద్భావనను ఈ హింస మసకబారుస్తుంది. నిజమైన రైతులందరినీ ఢిల్లీ చేసి సరిహద్దులకు తిరిగి రావాలని నేను కోరుతున్నాను.” అని అన్నారు.

Farmers 'tractor rally from Delhi border breaks police barricades, clashes with police personnel, farmers' protest rally reaches ITO area.

ఢిల్లీలో రైతు-పోలీసుల ఘర్షణలపై, సిపిఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం యెచురీ మాట్లాడుతూ,”రైతులపై టియర్ గ్యాస్ మరియు లాఠీ చార్జింగ్ చేయడం ఆమోదయోగ్యం కాదు. ఢిల్లీ పోలీస్ & సంయుక్త కిసాన్ మోర్చా ఒప్పందం తరువాత ఎందుకు ఈ పరిస్థితి చోటు చేసుకుంది? ప్రభుత్వం ఎందుకు ఘర్షణను రేకెత్తిస్తోంది ? శాంతియుత ట్రాక్టర్ పరేడ్ కొనసాగించడానికి పోలీసులు ఎందుకు అనుమతించలేదు” అని ప్రశ్నిచారు.

Leave a Reply