- తల్లితో కలసి వేరుగా వచ్చిన షర్మిల
- వైఎస్ విగ్రహం వద్ద నివాళి అర్పించిన మంత్రి బాషా
కడప,జూలై 8 : ఇడుపులపాయలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ భారతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. షర్మిలతో పాటు కొడుకు, కూతురు కూడా పాల్గొన్నారు. అయితే వీరంతా వేర్వేరుగా వచ్చి నివాళులు అర్పించారు. ఏటా కలసి వచ్చి ప్రార్థనల్లో పాల్గొనే వారు. ఈ సారి సిఎం జగన్ రాలేదు. షర్మిల కూడా కేవంల తల్లితో కలసి వచ్చారు. ఇకపోతే వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాష కడపలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమంలో మాల కార్పొరేషన్ చైర్మన్ అమ్మాజీ, మేయర్ సురేష్ బాబు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య, ఏపీ ఏనార్టీ డైరెక్టర్ ఇలియస్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో క్రిష్ణారెడ్డి కమలాపురం పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహమండలి చైర్మన్ సంబటూరు ప్రసాద్ రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రాజుపాలెం సుబ్బారెడ్డి, సుమిత్రా రాజశేఖర్ రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ ఉత్తమారెడ్డి పాల్గొన్నారు. రాజంపేట మండలంలో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
రైతు దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యే కార్యాలయంలో పార్టీ జెండాను ఎగురవేశారు. అంతకముందు ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, అకేపాటి అమరనాథ్ రెడ్డి రాజంపేట పాత బస్టాండు వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. రాజంపేట మండలంలో రైతు దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యే కార్యాలయంలో పార్టీ జెండాను ఎగురవేశారు.