రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు
బరోడా : ఉత్తర ఆఫ్రికాలోని లిబియాలో భారత కుటుంబం కిడ్నాప్‌నకు గురైంది. గుజరాత్ రాష్ట్రంలోని మెహసాణా జిల్లా బదల్పుర గ్రామానికి చెందిన కిస్మత్‌సింప్ చావ్డా, అతని భార్య హీనాబెన్, వారి మూడేళ్ల కుమార్తె దేవాన్షి లిబియాలో అపహరణకు గురైనది. పోర్చుగల్‌కు అక్రమ మార్గంలో వలస వెళ్లేందుకు నవంబర్ 29న అహ్మదాబాద్ నుంచి దుబాయ్‌కు విమానంలో వెళ్లిన ఈ కుటుంబం ఆ తర్వాత లిబియా బెంఘాజీకి చేరుకుని ముష్కరుల చేతిలో పడిరది. కిస్మత్‌సింప్‌ా సోదరుడు పోర్చుగల్‌లో స్థిరపడ్డాడు. భారతీయ ఏజెంట్ ద్వారా కాకుండా పోర్చుగల్ ఆధారిత ఏజెంట్ సహాయంతో వీరు అక్కడికి బయల్దేరారు. వారిని విడిచిపెట్టేందుకు కిడ్నాపర్లు రూ.2 కోట్లు డిమాండ్ చేశారు, మెహసాణాలోని వారి బంధువులు ఎస్పీ హిమాంషు సోలంకి, కలెక్టర్ ఎస్కే ప్రజాపతి, రాష్ట్ర ప్రభుత్వం, విదేశాంగ మంత్రిత్వ శాఖ, కేంద్ర ఏజెన్సీలకు సమాచారం ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే సీజే చవ్డా కూడా సమస్య లేవనెత్తారు. కుటుంబాన్ని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



