Take a fresh look at your lifestyle.

సంగారెడ్డి జిల్లాలో దారుణం ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం బలవన్మరణం

  • అందోల్‌ ‌పెద్దచెరువులో ఇద్దరు పిల్లలు, తల్లీ దూకి ఆత్మహత్య
  • రామచంద్రాపూర్‌లో భర్త ఆత్మహత్య
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

పటాన్‌చెరు/సంగారెడ్డి, డిసెంబర్‌ 3 (‌ప్రజాతంత్ర ప్రతినిధి): సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబంబలవన్మరణానికి పాల్పడింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. అప్పుల బాధ…ఇంట్లోని గోడవల కారణంగా భర్త ఊరి వేసుకుని బలవన్మరణం కాగా, భార్య ఇద్దరు పిల్లలు చెరువులో పడి అత్మహత్యకు పాల్పడిన హృదయవిదారకరమైన సంఘటన సంగారెడ్డి జిల్లాలో రామచంద్రపూర్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రామచంద్రాపురంలోని ఎంఐజీ కాలనీకి చెందిన చంద్రకాంత్‌కు కామారెడ్డి జిల్లా చిట్యాలకు చెందిన లావణ్యతో గత పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి కొడుకు ప్రీతమ్‌, ‌కూతురు సర్వజ్ఞలు ఉన్నారు. చంద్రకాంత్‌ ‌టిసిఎస్‌ (‌టాటా కన్సల్టెన్సీ కంపెనీ)లో సాఫ్ట్ ‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తూ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. బీహెచ్‌ఈఎల్‌లో నూతనంగా ఇల్లును కొనుగోలు చేయడంతో చంద్రకాంత్‌కు అప్పు కావడంతో అప్పును తీర్చేందుకు వారి స్వగ్రామమైన జహీరాబాద్‌ ‌మండలం అల్లాపూర్‌లో ఉన్నభూమిలో తన వాటా కింద 2 ఎకరాల భూమిని విక్రయిద్దామని తన తండ్రి నాగేశ్వరరావుతో చెప్పగా.. అయన దానికి ఒప్పుకొకపోవడంతో గతేడాది నుంచి తరుచూ గోడవ జరుగుతున్నట్లు చెబుతున్నారు.

అప్పుల బాధ ఎక్కువ కావడంతో అల్లుడి బాధ చూడలేక లావణ్య తండ్రి(చంద్రకాంత్‌ ‌మామ)రాజేందప్రసాద్‌ ‌రూ.35 లక్షల అర్థిక సహయం చేశారు. అయినప్పటికీ అప్పులు తీరకపోవడంతో గురువారం సాయంత్రం తండ్రి..కొడుకుల మధ్య ఇంట్లో గోడవ జరగుగా.. విసుగు చెందిన చంద్రకాంత్‌ (35) ‌తాను చనిపోతానని చెప్తూ గదిలోకి వెళ్లి డోర్‌ ‌వేసుకోగా, లావణ్య తన ఇద్దరి పిల్లల్ని తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. పటాన్‌చెరు బస్టాండ్‌ ‌వద్దకు వచ్చి వేరే వారి ఫోన్‌తో ఇంటికి ఫోన్‌ ‌చేసి, చంద్రకాంత్‌ ‌గూర్చి ఆరా తీయగా, అతను ఊరివేసుకుని చనిపోయినట్లు చెప్పారు. తాను కూడా బతకడం వ్యర్థమేనని భావించి ఆమె ఇంటికి వెళ్లకుండా బస్సెక్కి అందోలు వద్దకు రాత్రికి చెరుకుని, తన పిల్లలు ప్రతామ్‌ (9), ‌సర్వజ్ఞ(15 నెలలు)లను పెద్ద చెరువులో ముందుగా పడేసి, తాను దూకినట్లు తెలుస్తొంది.

శుక్రవారం ఉదయం చెరువులో మృతదేహాలు తేలడంతో, అటువైపుగా వెళ్లిన వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తము జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే, చంద్రకాంత్‌ ‌మృతి చెందాడాన్న విషయం తెలుసుకున్న లావణ్య తన ఇద్దరి పిల్లలతో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో ఆమె అచూకి కోసం లింగంపల్లిలో పోలీస్‌ ‌స్టేషన్‌లో గురువారం సాయంత్రం ఫిర్యాదు చేయగా, మిస్సింగ్‌ ‌కేసుగా పోలీసులు నమోదు చేశారు. ఆమె పటాన్‌చెరు నుంచి ఫోన్‌ ‌చేసినట్లు ఆధారాలుండడంతో, అటువైపుగా సంగారెడ్డి వరకు బంధువులు, పోలీసులు రాత్రంతా వెతికినా ఎక్కడా ఆమె అచూకీ లభించలేదు. అందోలు పెద్ద చెరువులో శుక్రవారం ఉదయం మృతదేహాలు లభ్యం కావడంతో, ఆమె బంధువులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply