Take a fresh look at your lifestyle.

మృతుల కుటుంబాలను, నష్టపోయిన వారిని.. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి
బాధితులకు అండగా నిలవాలని పార్టీ క్యాడర్‌కు నిర్దేశం

హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా గత మూడు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసి ప్రజలు తీవ్రంగా నష్టపోయారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి తెలిపారు. బుధవారం నాడు ఆయన ఒక ప్రకటన చేస్తూ ప్రభుత్వం వరదల నివారణలో పూర్తిగా విఫలం అయిందని హైదరాబాద్‌ను దల్లాస్‌ ‌చేస్తామని గొప్పలు పలికిన నాయకులు, 67 వేల కోట్లతో అభివృద్ధి చేశామని చెప్పిన వారు ఇప్పటి పరిస్థితికి ఏమి సమాధానం చెవుతారని ప్రశ్నించారు.

ఇప్పటికైనా పెద్దఎత్తున ప్రభుత్వం మునిసిపల్‌, ‌విద్యుత్‌, ‌వాటర్‌ ‌వర్కస్, ‌నీటి పారుదల, డిజాస్టర్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌తదితర శాఖలు సమన్వయంతో పని చేసి ప్రజలను త్వరగా ఆదుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌నాయకులు, కార్యకర్తలు బాధితులకు, నష్టపోయిన వారికి అండగా నిలిచి ఆదుకోవాలని, వారి కష్టాలలో భాగం పంచుకొవాలని పిలుపునిచ్చారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply