బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోండి డిజిపికి కాంగ్రెస్ ఫిర్యాదు
డీజీపీ మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ నేతల బృందం కలిసింది. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి వి•ద తప్పుడు ప్రచారం చేసిన వారిపై ఫిర్యాదు చేశామని తెలిపారు. పోలింగ్ ముగిసేలోపు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతో టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని విమర్శించారు. హరీష్‌రావు, రఘనందనరావు కలసి కాంగ్రెస్‌పై కుట్ర చేశారని ఆరోపించారు. ఎన్నికల ప్రధాన అధికారిని కూడా కలిసి ఫిర్యాదు చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దుబ్బాక ఎన్నికలలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డీజీపీ మహేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
ఈ విషయంపై ఫిర్యాదు చేయడానికి కాంగ్రెస్ నేతలు మంగళవారం టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, పలువురు కాంగ్రెస్ నేతలు డీజీపీ కార్యాలయానికి వొచ్చారు. దుబ్బాకలో పోలింగ్ మొదలు కాగానే సోషల్ వి•డియాలో టీఆర్ఎస్, బీజేపీలు దుష్పచ్రారం మొదలు పెట్టాయని పీసీసీ చీఫ్ అన్నారు. ‘కాంగ్రెస్ అభ్యర్ధి టీఆర్ఎస్లో చేరినట్లు ప్రముఖ టీవీ ఛానెల్లో బ్రేకింగ్ నడిచినట్లు ఒక వీడియో సృష్టించి సోషల్ వి•డియాలో ప్రచారం చేశారు. దీనిపై స్పందించిన ఆ టీవీ ఛానెల్ కూడా మేము ప్రసారం చేయలేదని చెప్పింది. ఓటమి భయంతో హరీష్ రావు, రఘనందన్ చేసిన కుట్రే ఇది. ఈ కుట్రపై డీజీపీకి ఫిర్యాదు చేశాం. కేరళలో ఇదే విధంగా దుష్ప్రచారం చేస్తే ఎన్నికల కమిషన్ గెలిచిన అభ్యర్థిని డిస్ క్వాలిఫై చేసింది. కేరళ హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పును ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తాం’ అని ఆయన అన్నారు.