Take a fresh look at your lifestyle.

సోషల్‌ మీడియా వేదికగా బిజెపి పై తప్పుడు ప్రచారం

పార్టీ ఐటీ సెల్‌ ‌కన్వీనర్‌ ‌వెంకటరమణ ఫిర్యాదు
‌సైబర్‌ ‌క్రై ‌పోలీసులకు టీఆర్‌ఎస్‌ ‌సోషల్‌ ‌మీడియా కన్వీనర్‌ ‌మన్నె క్రిశాంక్‌పై బీజేపీ ఐటీ సెల్‌ ‌ఫిర్యాదు చేసింది. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌పై తప్పుడు ఆరోపణలు చేశారని ఐటీ సెల్‌ ‌కన్వీనర్‌ ‌వెంకటరమణ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సోషల్‌ ‌మీడియాలో దుష్పచ్రారం చేస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. బండి సంజయ్‌ అ‌క్రమంగా రూ.600కోట్లు ఆర్జించారంటూ సోషల్‌ ‌వి•డియాలో ఓ వీడియో హల్‌ ‌చల్‌ ‌చేస్తున్న విషయం తెలిసిందే.

ఇది ఫేక్‌ ‌వీడియో అంటూ సైబర్‌ ‌క్రై ‌పోలీసులకు బీజేపీ ఐటీ సెల్‌ ‌శుక్రవారం ఫిర్యాదు చేసింది. సంజయ్‌పై రూపొందించిన ఫేక్‌ ‌వీడియోను ట్విట్టర్‌లో వైరల్‌ ‌చేస్తున్నారని, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలో మన్నె క్రిశాంక్‌పై ఫిర్యాదు చేసింది. తమ పార్టీ పరువుకు భంగం కలిగించేలా క్రిశాంక్‌ ‌చర్యలు ఉన్నాయని ఫిర్యాదులో తెలిపారు.

Leave a Reply