Take a fresh look at your lifestyle.

టిడిపి నేతలపై అ‌క్రమ కేసులు

దొంగలెక్కలు రాయడంలో విజయసాయి సిద్దహస్తుడు
టిడిపిని గెలిపిస్తే అన్న క్యాంటీన్లు తెరిపిస్తాం: చంద్రబాబు
‌విజయసాయిరెడ్డి దొంగ లెక్కలు రాయడంలో సిద్ధహస్తుడని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. శనివారం జగదాంబ జంక్షన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… విశాఖలో మేయర్‌ను గెలిపిస్తే అన్న క్యాంటీన్లు ఓపెన్‌ ‌చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌కోసం జరిగిన త్యాగాలకు వైసీపీ నాయకులు గౌరవం లేకుండా చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్‌ ఎ•-‌లాంట్‌ ‌భూములను విక్రయించాలని సీఎం అంటున్నారన్నారు. భూమి విలువ చూసిన సీఎం జగన్‌కు త్యాగం విలువ తెలియదని చెప్పారు. విశాఖ రాజధాని పేరుతో కావాలనే మోసం చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ‌రెడ్డిపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఏ తప్పు చేయని అచ్చెన్నాయుడుపై కేసు పెట్టారని.. ఆయనపై కేసు పెడితే జగన్‌ ‌చేసిన అన్యాయానికి, అవినీతికి జీవితాంతం జైల్లో ఉండాలని, బయట ఉండే అర్హత లేదని అన్నారు. విశాఖ మేయర్‌గా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి శ్రీనివాసరావుపై కూడా కేసు పెడతారని, ఇది అరాచకానికి పరాకాష్టని అన్నారు. ఎక్కడికక్కడ టీడీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. విశాఖకు ఒక శని పట్టిందని, అది ఏ2 విజయసాయిరెడ్డని, ఆ శనిని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిదని చంద్రబాబు అన్నారు.

Leave a Reply