Take a fresh look at your lifestyle.

ప్రభుత్వాశయాన్ని ప్రశ్నార్దకం చేస్తున్న నకిలీ విత్తనాలు

“ఏరువాక పున్నమితో ఖరీఫ్‌ ‌సీజన్‌ ‌మొదలయ్యింది.. అయితే అంతకు ముందుగానే నకిలీ విత్తన ముఠాలు గ్రామాల్లో ప్రవేశించాయి.. చాప కింద నీరులా పల్లెల్లో ప్రచారం చేసుకుంటూ అమాయక రైతులను వలలో వేసుకుంటున్నాయి.. విస్తృతమవనున్న పత్తి సాగు విస్తీర్ణం మేరకు నకిలీ విత్తనాలు చోటు చేసుకుంటే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది..”

పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచాలన్న ప్రభుత్వాశయానికి నకిలీ విత్తనాలు తూట్లు పొడుస్తున్నాయి..రాష్ట్రంలో ఒకటొకటిగా వెలుగు చూస్తున్న అనధికార విత్తన విక్రయ ఘటనలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి… విత్తన ఒప్పంద చట్టం ( ఎం ఓ యూ) లేకపోవటంతో దుకాణాల్లో రసీదులతో కొనుగోలు చేసిన అధికారిక కంపీనీల్లో దిగుబడి దక్కని పరిస్థితుల్లో రైతులు తగిన పరిహారం పొందలేకపోతున్నారు..ఇక గ్రామాలకొచ్చి అపరిచుతులు విక్రయించే ఊరుపేరు లేని విత్తనాలద్వారా దిగుబడి నష్టపోతే వినియోగ దారుల ఫోరం ను ఆశ్రయించే అవకాశం కూడా ఉండదు..  నకిలీ విత్తనాలను అడ్దుకోవటంలో వ్యవసాయశాఖ ప్రతి ఏడాది మాదిరిగా ఈ సారీ విఫల మయ్యింది.. వ్యవసాయ శాఖ, నిఘా విభాగాలు విఫలమవు తుండటంతో ఈ పరిస్థితి నెలకొంది..

ఏరువాక పున్నమితో ఖరీఫ్‌ ‌సీజన్‌ ‌మొదలయ్యింది.. అయితే అంతకు ముందుగానే నకిలీ విత్తన ముఠాలు గ్రామాల్లో ప్రవేశించాయి.. చాప కింద నీరులా పల్లెల్లో ప్రచారం చేసుకుంటూ అమాయక రైతులను వలలో వేసుకుంటున్నాయి.. విస్తృతమవనున్న పత్తి సాగు విస్తీర్ణం మేరకు నకిలీ విత్తనాలు చోటు చేసుకుంటే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది..

తొలకరి పంటసాగులో రైతులు ముందుగా పత్తిని విత్తుతారు కనుక  పొరుగు రాష్ట్రాలైన్‌ ఏ ‌పీ, మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక, గుజరాత్‌, ‌ప్రాంతాలకు చెందిన చెందిన ముఠాలు ఏటా మే నెలలోపే అనధికార విత్తనాలను డంప్‌ ‌చేస్తాయి..జిన్నింగ్‌ ‌మిల్లుల వద్ద విత్తనాలను సేకరించి వాటిని గుడ్డ సంచుల్లో నింపి అధిక దిగుబడి తక్కువ ధర ఆశ చూపి రైతులను బుట్టలో వేసుకుంటారు.. గ్రామాల్లో తమ ఏజెంట్లను నియమించుకొని రైతులకు భరోసా కల్పించే చర్యలకు పల్పడతారు.. వీరి ఆటలు సాగకుండా ప్రభుత్వం ఏటా మార్చి నెలలోనే టాస్క్ ‌ఫోర్స్, ‌విజిలెన్స్ ‌టీం లను ఏర్పాటు చేసి ఊరుపేరు లేని విత్తనాల దిగుమతిని అడ్దుకోవాల్సి ఉంది..ట్రాన్స్ ‌పోర్ట్ ‌కంపెనీలు తదితర చోట్ల దాడులు జరపటం ద్వారా అనధికార విత్తన దందాకు చెక్‌ ‌చెప్పాల్సి ఉంది.. కానీ విజిలెన్స్ ‌టీం లలో నియమిం పబడిన అధికారుల మధ్య సమన్వ్యం కొరవడటం , అప్రంత్తంగా లేకపోతుండటంతో నాసిరకం విత్తనాల వ్యాపారం మూడు బస్తాలు ఆరు సంచులుగా సాగుతోంది..

తెలంగాణలో తంగేళ్ళ బీడు దుస్థితి తొలిగి పచ్చని పంట సిరులు వెల్లి విరియాలని ప్రభుత్వం కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే.. అపర భగీరధుడిలా పాటుపడుతూ ఇప్పటికే లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీటినందిస్తున్న విషయం విదితమే..  రైతుబతుకు బంగారమయ్యేందుకు వారితో తెల్ల బంగారం పండించాలని ముఖ్యమంత్రి కేసీ ఆర్‌ ‌పత్తిసాగును సూచించారు.. పత్తి వినియోగం ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది 11 శాతం అధికం కానుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. డిమాండ్‌ ఉం‌డే పంటలనే సాగు చేయించాలన్న సంకల్పంతో నియంత్రిత పంటల విధానాన్ని ప్రవేశ పెట్టారు.. ఈ విధానంలో అత్యధిక విస్తీర్ణాన పత్తి సాగు కానుండగా ఆ పంటకు సంబందించి నకిలీ విత్తన కత్తి రైతు మెడపై వేళాడుతోంది..
తాజాగా నిర్మల్‌ ‌జిల్లాలో అంతకుముందు కరీం నగర్‌, ‌రంగా రెడ్డి జిల్లాలో తదితర చోట్ల వెలుగు చూసిన అనధికార విత్తన విక్రయాలు నకిలీల ప్రవేశానికి అద్దం పడుతున్నాయి.. ఏటా నకిలీ విత్తన దందా సాగుతున్నా ఆమేరకు కేసులు నమోదు కాకావటం లేదు  గత 2014 నుంచి ఇప్పటి వరకు కేసుల నమోదు 391 మాత్రమే కావటం గమనార్హం..

పత్తి పంటకు ఈఏడాది విదేశీ ఎగుమతి ఆర్డర్లు పుష్కలంగా ఉంటాయని అంతర్జాతీయ నిపుణుల అంచనా మేరకు ప్రభుత్వం పత్తి పంట విస్తీర్ణం పెంపు సిఫారసు చేసింది.. మందేశంలో పండించే పత్తి ఇప్పటివరకు దేశాలకు ఎగుమతి అవుతుండగా.. కొత్తగా చైనా తదితర దేశాలనుండి ఆర్డర్లు లభించనుండటంతో అంతర్జాతీయంగా పత్తి డిమాండ్‌ ‌కు కారణం కానుంది.. దేశంలో పత్తి దిగుబడి 3.30 లక్షల కోట్ల బేళ్ళు కాగా అందులో తెలంగాణ వాటా 58 లక్షల బేళ్ళు , కాగా కొత్తగా సాగులోకి రానున్న విస్తీర్ణంతో మరో పది లక్షల బేళ్ళు అధికమవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది కానీ నకిలీ విత్తన విక్రయాలపై ఉక్కుపాదం మోపకపోతే రైతులు ఘోరంగా నష్టపోయే ప్రమాదముంది..
 – కె,శ్రీనివాస్‌ ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్
9346611455

Leave a Reply