Take a fresh look at your lifestyle.

‌కొత్తూరులో నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం

సిద్ధిపేట జిల్లాలోని ములుగు పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో గల కొత్తూరులో పోలీసులు నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా విజిలెన్స్ అం‌డ్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు సిఐ బాల్‌ ‌రెడ్డి, ములుగు మండల వ్యవసాయ అధికారి ప్రగతి, గజ్వేల్‌ ‌రూరల్‌ ‌సిఐ కోటేశ్వరరావు, ములుగు ఎస్‌ఐ ‌రాజేంద్ర ప్రసాద్‌ ‌సిబ్బందితో కలసి ములుగు మండలం కొత్తూరు గ్రామ శివారులో ఉన్న జై హనుమాన్‌ ‌స్వీట్‌ ‌కంపెనీపై రైడ్‌ ‌చేయగా దాదాపు 17 లక్షల రూపాయల నకిలీ పత్తి విత్తనాలు, విత్తనాలు తయారుచేసే సామాగ్రిని సీజ్‌ ‌చేసి కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించినట్లు ములుగు పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ..నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసే వారిపై, అమ్మే వారి పై పీడీ యాక్ట్ ‌కింద కేసులు నమోదుచేసి చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలపై ప్రజలకు ఏదైనా సమాచారం ఉంటే డయల్‌ 100, ‌లేదా సిద్దిపేట పోలీస్‌ ‌కమిషనరేట్‌ ‌వాట్సాప్‌ ‌నెంబర్‌ 7901100100 ‌సమాచారం అందించాలని సూచించారు.

Leave a Reply